ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం

Published : Jul 18, 2019, 09:12 AM IST
ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం

సారాంశం

విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో బస చేయనున్నారు. 24న రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ ను రాజభవన్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 24 అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ హరిచందన్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈనెల 
23న భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు.

విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో బస చేయనున్నారు. 24న రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ ను రాజభవన్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం.  
భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్‌ నివాసంగా, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే