ఏపీ కేబినెట్ భేటీ: 12బిల్లులకు ఆమోదం...?

By Nagaraju penumalaFirst Published Jul 18, 2019, 9:03 AM IST
Highlights

టీటీడీ పాల‌క‌మండ‌లిని ఎప్పుడైనా రీకాల్ చేసేలా హిందూ ధార్మిక చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌ల బిల్లు తీసుకురానుంది. వీటితోపాటు జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లపై కేబినెట్ చర్చించి మెుత్తం 12 బిల్లులను ఆమోదించనుంది జగన్ సర్కార్. 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక చట్టాలను తీసుకువచ్చేందుకు సీఎం జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. సుమారు 12 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 12 బిల్లుల‌పై చర్చించి వాటిని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు చట్టబద్దత కల్పించేలా రూపకల్పన చేసింది ప్రభుత్వం. 

ఈ కేబినెట్ భేటీలో ఏపి ఇన్ ఫ్రాస్ట‌క్చ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఎనేబ‌లింగ్ యాక్ట్ 2001కి స‌వ‌ర‌ణ‌ల బిల్లుతోపాటు అదే బిల్లులో జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌ించే బిల్లును కూడా ఆమోదించనుంది. 

అంతేకాదు పలు పాల‌క‌మండ‌ళ్ళ ర‌ద్దుతోపాటు నియామకాల కోసం దేవాదాయ శాఖ చ‌ట్టంలో నూతన మార్పులు చేసే బిల్లుపై కూడా చర్చ జరగనుంది. ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు క‌ల్పించే బిల్లుపై కూడా ఆమోద ముద్ర పడనుంది. 

click me!