రోడ్లపై నేలరాలిన వందల పక్షులు .. తెనాలిలో బర్డ్ ఫ్లూ కలకలం..?

By Siva KodatiFirst Published Jan 6, 2021, 5:37 PM IST
Highlights

బర్డ్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. తెలుగు, రాష్ట్రాల్లో ఫ్లూ భయం పట్టుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో వందల సంఖ్యలో పక్షులు నేలరాలాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనుంది

బర్డ్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. తెలుగు, రాష్ట్రాల్లో ఫ్లూ భయం పట్టుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో వందల సంఖ్యలో పక్షులు నేలరాలాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనుంది.

ముందు జాగ్రత్తగా స్పెషల్ టీంలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎలాంటి ముప్పు లేదన్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.

Also Read:విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ: వేలాది పక్షులను చంపనున్న కేరళ

వలస పక్షల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని.. కోళ్ల ఫారాల్లో చనిపోయో కోళ్ల శాంపిల్స్ వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపించాలని అధికారులను తలసాని ఆదేశించారు.

ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫారాల్లో అక్కడక్కడా కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి.. పరీక్షలు చేయాలని సూచించారు. బర్ల్ ఫ్లూ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావారణమార్పుల శాఖ అడ్వైజరీ జారీచేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే ఆ వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచించింది. 

click me!