రామతీర్థంపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా.. ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే..

Bukka Sumabala   | Asianet News
Published : Jan 06, 2021, 04:19 PM IST
రామతీర్థంపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా.. ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే..

సారాంశం

ఉద్రిక్తతలకు దారితీసిన విజయనగరంలోని, రామతీర్థంలో అధికారులు ఆంక్షలను విధించారు. రెవెన్యూ యంత్రాంగం సెక్షన్‌ 30ను ప్రయోగించింది. ఏపీ రాజకీయాలను రామతీర్థం ఘటన కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాముడి విగ్రహ ధ్వంసం అనంతర పరిణామాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అక్కడ ఎలాంటి నిరసన తెలియజేయాలన్నా పోలీసుల అనుమతి అవసరం. రామతీర్థం ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గం, కొండపైనున్న కోదండరాముని ఆలయం, కొండకు వెళ్లే ముఖద్వారం, వెనుక భాగంలోనూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ధర్మయాత్ర సందర్భంగా రామతీర్థం రణరంగమైంది. రామతీర్థం వెళ్లకుండా బీజేపీ, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వీరితో పాటుగా వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. రామతీర్థంపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు.ఏ సంఘమైనా, రాజకీయ పార్టీ ప్రతినిధులైనా రామతీర్థంలో ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి. 

ఈ సెక్షన్‌ కేవలం రామతీర్థంలోనే కాకుండా విజయనగరం డివిజన్‌ పరిధి అంతటికీ వర్తిస్తుంది. ఒకవేళ అనుమతులు లేకుండా ఏ ఒక్కరైనా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే నేరుగా  నిర్వాహకులపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu