ఆ మంత్రి డబ్బు కోసం ఏం చేస్తున్నారో తెలుసా?

First Published May 7, 2017, 3:06 AM IST
Highlights

తమ కుటుంబసభ్యులు మాత్రమే ఉండాల్సిన బంగాళ్ళల్లో, తమ సొంత అవసరాలకు మాత్రమే వాడుకోవాల్సి ఉండగా ఇలా డబ్బుకు కక్కుర్తిపడటం విచిత్రంగా లేదు. అంటే డబ్బు కోసం ఎంతస్ధాయికన్నా దిగజారుతారన్న విషయం బయబపడలేదూ.

‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల’ని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇపుడున్న సంపాదన చాల్లేదు కాబోలు బీహారు మంత్రులకు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. మామూలుగానే ప్రజా ప్రతినిధులంటే విపరీతమైన అధికారం, సంపాదనకు కొదవే ఉండదు. అటువంటిది జంగిల్ రాజ్ గా పేరుపొందిన బీహార్ వంటి రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులకు ఏం కొదవ. అందులోనూ ఎంఎల్ఏ, మంత్రులంటే ఇంక చెప్పనే అక్కర్లేదు.

బీహార్ రాష్ట్రంలోని కొందరు మంత్రులు తమ బంగళాలను అద్దెలకు ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూస్ 18 పరిశోధనలు పలు విషయాలు బయటపడ్డాయి. కొందరు మంత్రులు తమ బంగాళను 24 గంటల లెక్కన పెళ్ళిలకు అద్దెలకు ఇస్తున్నారట. అంటే వారికి ఎటువంటి శ్రమలేకుండానే రోజుకు రూ. 2.5 లక్షలు వచ్చి ఒళ్ళో పడుతున్నాయన్నమాట. పై మొత్తం కేవలం తమ బంగాళ చుట్టూ ఉన్న ఖాళీ స్ధలాన్ని అద్దెకు ఇచ్చినందుకు మాత్రమే. కరెంటు, నీళ్ళు తదితరాలు వాడుకున్నందుకు అదనం. ప్రస్తుతం ఒక మంత్రి భాగోతం బయటపడింది. ఇంకెతమంది మంత్రులున్నారో చూడాలి.

తమ కుటుంబసభ్యులు మాత్రమే ఉండాల్సిన బంగాళ్ళల్లో, తమ సొంత అవసరాలకు మాత్రమే వాడుకోవాల్సి ఉండగా ఇలా డబ్బుకు కక్కుర్తిపడటం విచిత్రంగా లేదు. అంటే డబ్బు కోసం ఎంతస్ధాయికన్నా దిగజారుతారన్న విషయం బయబపడలేదూ. వీరి బంగళాలను కేవలం పెళ్లిలకు మాత్రమే కాదు డబ్బులు వచ్చే ఇతర కార్యక్రమాలకు కూడా అద్దెలకు ఇస్తున్నారట. ఆర్జేడీ ఎంఎల్ఏ, మైనారిటీ శాఖ మంత్రి అబ్దుల్ గఫూర్ తన నివాసాన్ని పెళ్ళిల్లకు ఇస్తు పట్టుబడ్డారు. తన ఇంట్లో ఉన్న సెక్యురిటీ సిబ్బంది, వివాహాల బ్రోకర్ కథనాన్ని కూడా న్యూస్ 18 ప్రసారం చేసింది. ఇదే విధమైన ఆరోపణలు ఢిల్లీలోని పలువురు ఎంపిలు, కేంద్రమంత్రులపైన కూడా వినబడుతోంది.

అదే విషయమై గఫూర్ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసారు. పెళ్ళి చేసుకునేందుకు చోటు దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి తన బంగళాలో అవకాశం ఇవ్వటం కూడా తప్పేనా? అంటూ ఎదురు ప్రశ్నించారు. తన బంగళా వెనుక చాలా ఖాళీ ప్రదేశం ఉందని, అదంతా వృధాగా ఉంటోంది కాబట్టే పెళ్లిలకు ఇస్తున్నట్లు సమర్ధించుకున్నారు. ఇపుడీ విషయం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దృష్టికి వెళ్లింది. చూడాలి ఏం చేస్తారో?

click me!