వేగాన్ని అందుకోలేక పోతున్నాడట!

Published : May 06, 2017, 11:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
వేగాన్ని అందుకోలేక పోతున్నాడట!

సారాంశం

పార్టీ సంక్షేమం కోసం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నట్లు కూడా చెప్పారు. ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నది అదేకదా? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయని విపక్షాలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నది వాస్తవాలేనా మరి?

చంద్రబాబునాయుడు వేగాన్ని పుత్రరత్నం నారాలోకేష్ అందుకోలేకపోతున్నారట. విశాఖపట్నం జిల్లా పర్యటనలో తిరుగుతున్న లోకేష్ ఈరోజు మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనట. మరి మంత్రులు, ఎంల్ఏ, ఎంపిలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఏం చేస్తారో చెప్పలేదు పుత్రరత్నం. త్వరలోనే కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తాం అనికూడా శెలవిచ్చారు. ఒకవైపేమో ఆమధ్య చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా ఈసారి కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేసామని చెప్పుకొచ్చారు. అంటే భవిష్యత్తులో నియమించే ఉద్దేశ్యం లేదనుకోవాలా?

పార్టీకి చెడ్డపేరు తీసుకురానని హామీ కూడా ఓటి ఇచ్చారండోయ్. చెడ్డపేరు తీసుకురావటమంటే లోకేష్ ఉద్దేశ్యంలో ఏమిటో? నోటి నుండి జాలువారుతున్న ఆణిముత్యాలతో పార్టీ, ప్రభుత్వం ప్రతీ రోజు నవ్వులపాలవుతున్నది చాలదా? తాను దొంగబ్బాయ్ కాదట. దొంగ పేపర్లు, దొంగ ఛానళ్ళు నడపటం లేదట. ప్రత్యక్షంగా ప్రస్తుతానికి ఏ ఛానల్లోనూ ప్రమేయం లేకపోయుండచ్చు.

టిడిపికి, చంద్రబాబుకు జాకీలేసే మీడియా ఏవన్న విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. కాబట్టి సొంత మీడియాతో ఇంకేం అవసరముంటుంది? అన్నట్లు ఆమధ్య కొంతకాలం లోకేష్  ఓ టివి ఛానల్ ను నడిపినట్లు గుర్తు. పార్టీ సంక్షేమం కోసం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నట్లు కూడా చెప్పారు. ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నది అదేకదా? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయని విపక్షాలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నది వాస్తవాలేనా మరి?

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu