ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రహ్మణి సహా నారాయణ ములాఖత్

By narsimha lode  |  First Published Sep 29, 2023, 11:19 AM IST

టీడీపీ చీప్ చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రహ్మణి, మాజీ మంత్రి నారాయణలు  ఇవాళ  ములాఖత్ అయ్యారు.


అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబుతో  భువనేశ్వరి, బ్రహ్మణి, మాజీ మంత్రి నారాయణ శుక్రవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యారు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.ఈ నెల 12, 14,18, 25 తేదీల్లో చంద్రబాబును  కుటుంబసభ్యులు కలిశారు. ఇవాళ మరోసారి  చంద్రబాబుతో మరోసారి కలిశారు.  వారానికి రెండు దఫాలు కుటుంబసభ్యులను కలుసుకొనే అవకాశం ఉంది. దీంతో  చంద్రబాబును ఇవాళ కుటుంబ సభ్యులు  ములాఖత్ అయ్యారు. ఈ నెల  25న చంద్రబాబుతో  భువనేశ్వరి, బ్రహ్మణి, అచ్చెన్నాయుడు ములాఖత్ అయ్యారు.  ఇవాళ మాజీ మంత్రి నారాయణ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును ఈ నెల  9వ తేదీన  ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుండి చంద్రబాబు జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు.వచ్చే నెల 5వ తేదీ వరకు  జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉండనున్నారు.  ఇదిలా ఉంటే ఏపీ ఫైబర్ నెట్ కేసు,  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో  పోలీసులు పీటీ వారంట్లు కోర్టుల్లో దాఖలు చేశారు.  మరోవైపు  ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  మాజీ మంత్రి నారాయణపై  కూడ గతంలోనే  ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

also read:రాజమండ్రి జైలు సూపరింటెండ్ పై నిఘా: బాబుతో ములాఖత్ తర్వాత అచ్చెన్నాయుడు

ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను కూడ ఏ 14గా  సీఐడీ చేర్చింది.ఈ కేసులో సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ కు  ఏపీ హైకోర్టు సూచించింది. లో‌కేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అంతేకాదు సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది.

click me!