యూట్యూబ్ వీడియో కోసం వన్యప్రాణిని చంపిన ముగ్గురు: అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు

Published : Sep 29, 2023, 10:42 AM ISTUpdated : Oct 01, 2023, 11:41 AM IST
యూట్యూబ్ వీడియో కోసం వన్యప్రాణిని చంపిన ముగ్గురు: అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు

సారాంశం

అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో వన్యప్రాణిని చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.


అనంతపురం:అల్లూరి జిల్లాలోని  అనంతగిరి మండలం  లక్ష్మీపురంలో వన్యప్రాణిని చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ వీడియో కోసం   వన్యప్రాణిని ముగ్గురు యువకులు చంపారు.  ఈ విషయమై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు  మేరకు పోలీసులు   దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో  ముగ్గురు యువకులు  వన్యప్రాణిని చంపినట్టుగా పోలీసులు గుర్తించారు.యూట్యూబ్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ కోసం వన్యప్రాణిని  చంపినట్టుగా గుర్తించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో  వన్యప్రాణులను చంపిన ఘటనలు గతంలో కూడ నమోదయ్యాయి.హైద్రాబాద్ లో జింక, దుప్పి మాంసం అమ్ముతున్న ముఠాను ఈ ఏడాది ఆగస్టు  14న  అరెస్ట్ చేశారు. నిందితుల నుండి  16 కేజీల  మాంసాన్ని సీజ్ చేశారు. శంషాబాద్  ఎయిర్ పోర్టు పరిధిలోని గగన్ పహాడ్ లో తనిఖీలు చేసిన సమయంలో జింక, దుప్పి మాంసం విక్రయిస్తున్నారనే సమాచారంతో అరెస్ట్ చేశారు.
2019లో హైద్రాబాద్ బహదూర్ పురాలో   మాంసం పేరుతో జింక మాంసం విక్రయించే  జమీర్ ని  పోలీసులు అరెస్ట్ చేశారు.  2020లో  ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం టీవీటీపల్లి అటవీ ప్రాంతంలో  జింక మాంసం కలకలం రేపింది. జింకను వేటగాళ్లు హతమార్చినట్టుగా అటవీశాఖాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. 2021లో అనంతపురం జిల్లాలో జింక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని  పోలీసులు అరెస్ట్ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu