కర్నూల్ రాజధాని అయితే ఒరిగేది ఏమీ లేదు.. అఖిల ప్రియ షాకింగ్ కామెంట్స్!

Published : Dec 23, 2019, 01:55 PM ISTUpdated : Dec 23, 2019, 02:45 PM IST
కర్నూల్ రాజధాని అయితే ఒరిగేది ఏమీ లేదు.. అఖిల ప్రియ షాకింగ్ కామెంట్స్!

సారాంశం

రాజధాని అంశంతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. రైతుల ఆందోళనలు, అధికార విపక్షాల పరస్పర విమర్శలతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

రాజధాని అంశంతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. రైతుల ఆందోళనలు, అధికార విపక్షాల పరస్పర విమర్శలతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 

అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అవసరం ఉందని.. ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమరావతిని శాసన నిర్వహణ రాజధానిగానే ఉంచుతూ.. వైజాగ్ లో కార్యనిర్వహణ రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు జగన్ ప్రకటించారు. 

దీనితో అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా టిడిపి ముఖ్య నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలుని రాజధానిగా ప్రకటించినంత మాత్రాన ఇక్కడి ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. 

రాయలసీమ ప్రజలు కోరుకునేది పరిశ్రమలు, ఉద్యోగాలు, నీళ్లు. అంతేకాని హైకోర్టు ఒక్కటి ఇచ్చి కర్నూలు రాజధాని అనడం సరికాదు. కేవలం హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రన సీమ ప్రజలకు నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా అని ఆమె ప్రశ్నించారు.  

AP Capital: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదంటా!

హైకోర్టు ఇచ్చి ఏదో ఉద్దరించినట్లు ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదు అని అఖిల ప్రియ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల పతిపాదన తీసుకువచ్చినట్లు అఖిలప్రియ ఆరోపించారు. అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని అఖిలప్రియ తెలిపారు. 

ఏపీ భవన్ లో తమ్మినేని సీతారాంకు అవమానం: భార్య ఆవేదన

ప్రభుత్వం తీసుకునే ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు బలవుతున్నారు. రాజధానిని అమరావతిలోని కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన అఖిల ప్రియ కర్నూలులో రాజధానిని వ్యతిరేకించడం సంచలనమే. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!