కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు.
కడప: ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన ఈ రోజును తాను జీవితంలో మర్చిపోలేని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కడప జిల్లాలో కడప ఉక్కు కర్మాగారానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు.
రూ. 15 వేల కోట్ల పెట్టుబడితో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మించనున్నారు.ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తైతే ఈ జిల్లాకు చెందిన వారికి ఉపాధి దక్కే అవకాశం ఉంది.
undefined
మూడు రోజుల పాటు కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తొలి రోజుపర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఎన్నికలకు ఆరు మాసాల ముందు చంద్రబాబునాయుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం మోసం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఇవాళ స్లీట్ ప్యాక్టరీ శంకుస్థాపన పనులను ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ రావాలని ఎంతో కాలంగా కలలు కన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు.
30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్‌ను నిర్మించబోతున్నట్టుగా జగన్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అవసరమైన ముడి ఇనుప ఖనిజం కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకొన్నట్టుగా జగన్ తెలిపారు.
ఈ ఫ్యాక్టరీతో జిల్లా వాసుల బతుకుల్లో మార్పులు వస్తాయని జగన్ అభిప్రాయపడ్డారు.