AP Capital: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదంటా!

Published : Dec 23, 2019, 12:56 PM ISTUpdated : Dec 23, 2019, 01:04 PM IST
AP Capital: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదంటా!

సారాంశం

ఏపీ రాజధాని అంశం అమరావతి ప్రాంత వైసిపి నేతలకు తలనొప్పి వ్యవహారంలా మారింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదు అంటూ గత ఆరు రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఏపీ రాజధాని అంశం అమరావతి ప్రాంత వైసిపి నేతలకు తలనొప్పి వ్యవహారంలా మారింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదు అంటూ గత ఆరు రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతుల కు మద్దతుగా టిడిపి, జనసేన, వామపక్ష పార్టీలు నిలుస్తున్నాయి. 

రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని.. రానున్నరోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అని రైతులు అంటున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రోజు మంగళగిరి రైతులు ఎమ్మెల్యే ఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని రైతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 'మంగళగిరి శాసన సభ్యులు రామకృష్ణ రెడ్డి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అమరావతి రాజధానిపై సందిగ్దత నెలకొని ఉంది. దీనిపై మా గోడుని ఎమ్మెల్యే తో చెప్పుకుందామంటే ఆయన ఏక్కడ ఉన్నారో తెలియడం లేదు. 

వైఎస్ జగన్ కు మద్దతు: చిరంజీవిపై సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

మీరు మా ఎమ్మెల్యే గారిని వెతికి మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం అంటూ మంగళగిరి రైతులు పోలీసులని కోరారు. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు వైసిపి నేతలపై ప్రస్తుతం ఎంత ఒత్తిడి ఉందో అని. 

మూడు రాజధానుల వివాదం.. టెంటు పీకేసిన పోలీసులు, రైతుల అర్థనగ్న నిరసన

గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులంతా రాజధాని కోసం 33 వేల ఎకరాలని ప్రభూత్వానికి ఇచ్చారు. ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానులు అంటి ప్రకటన చేయడంతో రైతుల్లో ఆందోనళ నెలకొంది. రాజధాని కోసం భూములిచ్చిన మా పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఫేక్ లెటర్స్ తో నాకు సంబంధం లేదు.. 3 రాజధానులపై చిరంజీవి క్లారిటీ!

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరం అని సీఎం జగన్ భావిస్తున్నారు. అమరావతిలో శాసన నిర్వహణ రాజధాని, వైజాగ్ లో కార్యనిర్వహణ రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని ఏర్పాటు చేయడంపై ఓ నివేదిక ఇవ్వాలని జగన్ జీ ఎన్ రావు కమిటీకి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!