ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. భూమా అఖిల ప్రియ అరెస్ట్..

Published : May 17, 2023, 08:20 AM ISTUpdated : May 17, 2023, 11:08 AM IST
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. భూమా అఖిల ప్రియ అరెస్ట్..

సారాంశం

టీడీపీ నేత అఖిలప్రియను ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమే పెద్ద సంఖ్యలో వెళ్లిన పోలీసులు ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. 

ఆళ్లగడ్డ : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయమే ఆళ్లగడ్డలోని అఖిల ప్రియ ఇంటికి పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లారు. ముందు పీఏ మోహన్ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. ఆమె మీద హత్యా యత్నం కేసు నమోదు చేశారు. నిన్న కేవీ సుబ్బారెడ్డి దాడి ఘటనలో అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ చానెల్ లో వార్త ప్రసారమైంది.

నిన్న రాత్రి సుబ్బారెడ్డిపై అకిల ప్రియ అనుచరులు దాడి చేశారు. ఆ సమయంలో ఆమె అక్కడే ఉంది. ఈ ఘటనలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. కారులో అఖిల ప్రియను పోలీసులు తీసుకెళ్లారు.  నిన్న యువకగళం పాదయాత్ర కొనసాగుతుండగా.. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు గొడవ పడడం చర్చకు దారి తీసింది. ఈ కేసులోనే అరెస్ట్ చూపిస్తారా? పాత కేసుల్లో అరెస్ట్ చూపిస్తారా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. అఖిలప్రియతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియను పాణ్యం పీఎస్ కు తరలించారు. 
 
ఇదిలా ఉండగా, నిన్న నంద్యాలలో టీడీపీనేత ఏవీ సుబ్బారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ వర్గీయులు దాడికి దిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో సాగుతోంది. ఈ సమయంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సుబ్బారెడ్డిని కారులో ఎక్కించి పంపారు. 

ఈ యాత్రలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడికి దిగారు. జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో ఆయన కూడా అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్