నెల్లూరులో కరోనా వచ్చిన ఫ్యామిలీ ఇంటికి తాళం: భాస్కర్ రెడ్డి అరెస్ట్

By narsimha lode  |  First Published Apr 21, 2021, 4:38 PM IST

కరోనా సోకిందని  ఇంట్లోనే ఓ కుటుంబాన్ని బంధించిన  భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని నవాబ్‌పేట పోలీసులు  బుధవారంనాడు అరెస్ట్ చేశారు.


నెల్లూరు: కరోనా సోకిందని  ఇంట్లోనే ఓ కుటుంబాన్ని బంధించిన  భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని నవాబ్‌పేట పోలీసులు  బుధవారంనాడు అరెస్ట్ చేశారు.నెల్లూరు జిల్లాలోని నవాబ్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న  దంపతులకు కరోనా సోకింది. ఈ విషయం తెలిసిన అపార్ట్ మెంట్ వాసులు కోవిడ్ సోకిన కుటుంబాన్ని ఇంట్లోనే ఉంచి బయట నుండి తాళం వేశారు.

also read:కరోనా పాజిటివ్ : భార్యభర్తల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి.. ప్రశ్నిస్తే పాతేస్తామంటూ బెదిరింపులు..

Latest Videos

undefined

తమకు కూడ కరోనా సోకుతుందనే భయంతో  తాళం వేసినట్టుగా  భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చెప్పారు. ఈ విషయమై బాధిత కుటుంబం వీడియోను తీసి  పోలీసులకు షేర్ చేసింది.  ఈ విషయం తెలిసి అపార్ట్ మెంట్ వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడ భాస్కర్ రెడ్డితో పాటు అపార్ట్‌మెట్ వాసులు తీవ్రంగా మండిపడ్డారు. మీడియా ప్రతినిధులను పాతరేస్తానని బెదిరించారు.కరోనా బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు  నవాబ్ పేట పోలీసులు బుధవారంనాడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

గత ఏడాదిలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కూడ ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకొన్నాయి. అయితే సెకండ్ వేవ్ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు..
 

click me!