లోకేష్ వైరస్...ఎన్టీఆర్ వ్యాక్సిన్ వ్యాఖ్యలు.. రాంగోపాల్ వర్మపై దివ్యవాణి ఘాటు రిప్లై

Published : Apr 21, 2021, 04:21 PM ISTUpdated : Apr 21, 2021, 04:26 PM IST
లోకేష్ వైరస్...ఎన్టీఆర్ వ్యాక్సిన్ వ్యాఖ్యలు.. రాంగోపాల్ వర్మపై దివ్యవాణి ఘాటు రిప్లై

సారాంశం

టిడిపిని లోకేష్ వైరస్ నుండి కాపాడే వ్యాక్సిన్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అన్న రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు దివ్యవాణి.   

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వైరస్ తో పోల్చి వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ టీడిపి నాయకురాలు దివ్యవాణి విరుచుకుపడ్డారు. టిడిపిని లోకేష్ వైరస్ నుండి కాపాడే వ్యాక్సిన్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ అంటూ వర్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు దివ్యవాణి. 

''నారా లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా, నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగ 420 పనులేవీ చేయట్ల. నీకు పేటిఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది'' అంటూ దివ్యవాణి ట్వీట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. 

''జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి రెడీగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్ గారికి తెలుసు. నారదుడి లాగ ఎప్పుడూ ఎవరికో ఒకరికి తగువులు పెట్టంది నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో'' అంటూ ఎద్దేవా చేశారు. 

''ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త'' అంటూ రాంగోపాల్ వర్మకు దివ్యవాణి హెచ్చరించారు. 

read more   తప్పుడు కేసులు, పోలవరం అంచనాల పెంపుపై మాట్లాడుతా: దేవినేని ఉమా

''తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే ప్రమాదకర వైరస్ సోకింది. దీన్ని తగ్గించే ఒకే ఒక వ్యాక్సిన్ జూనియర్ ఎన్టీఆర్.  టిడిపి క్యాడర్ కు నా సలహా ఏంటంటే... వెంటనే టిడిపి తారక్ వ్యాక్సిన్ అందేలా చూడండి లేదంటే మీరు చచ్చిపోతారు'' అంటూ రాంగోపాల్ వర్మ చేసిన సంచలన ట్వీట్ పైనే తాజాగా దివ్యవాణి పైవిధంగా స్పందించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu