మాట్లాడుదామని పిలిచి కాల్చి చంపాడు: భరత్ పై దిలీప్ సోదరుడి ఆరోపణలు

Published : Mar 28, 2023, 04:39 PM ISTUpdated : Mar 28, 2023, 04:40 PM IST
మాట్లాడుదామని పిలిచి  కాల్చి చంపాడు:  భరత్ పై దిలీప్  సోదరుడి ఆరోపణలు

సారాంశం

మాట్లాడుదామని   పిలిపించి  దిలీప్ పై  భరత్ కుమార్  యాదవ్  ను పిలిపించారని  మృతుడి బంధువులు  చెబుతున్నారు. 

పులివెందుల:  మాట్లాడుదామని పిలిచి  తన సోదరుడు దిలీప్ ను  భరత్ కుమార్ యాదవ్  కాల్చి చంపాడని  మృతుడు సోదరుడు చెప్పారు. మంగళవారంనాడు  దిలీప్ సోదరుడు  కడపలో  మీడియాతో మాట్లాడారు.  డబ్బుల విషయమై  తన సోదరుడిని  మాట్లాడుదామని  భరత్ కుమార్ యాదవ్ పిలిచాడన్నారు. ఈ విషయమై మాటా మాటా పెరగడంతో  భరత్ కుమార్ యాదవ్  కాల్పలకు దిగినట్టుగా  దిలీప్  సోదరుడు  చెప్పారు. 

దిలీప్,  భరత్ కుమార్ యాదవ్  మధ్య  ఆర్ధిక  లావాదేవీలపై  గొడవలు జరుగుతున్నాయి.  వారం రోజులుగా  ఈ గొడవలు  మరింత ఎక్కువైనట్టుగా  సమాచారం. తనకు  చెల్లించాల్సిన డబ్బుల విషయంలో  ఎంతవరకైనా వెళ్తానని  భరత్ కుమార్ యాదవ్  దిలీప్ నకు  వార్నింగ్  ఇచ్చినట్టుగా  కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు.  కానీ  ఇలా  చేస్తాడని అనుకోలేదని  దిలీప్  సోదరుడు  చెబుతున్నారు.  

మరో వైపు  దిలీప్,  భరత్ కుమార్ యాదవ్ మధ్య  ఓ స్థలం విషయమై  కూడా  గొడవ  జరుగుతుందని ప్రచారం కూడ సాగుతుంది.  భరత్ కుమార్ యాదవ్, దిలీప్ మధ్య  ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు తేల్చనున్నారు.  

also read:పులివెందులలో కాల్పుల కలకలం: ఒకరు మృతి, మరొకరికి గాయాలు

పులివెందులలో  కాల్పులు జరిగిన  ప్రాంతాన్ని  ఎఎస్పీ  పరిశీలించారు.  ఈ ఘటనకు  సంబంధించి స్థానికులను  పోలీసులు ప్రశ్నించారు. భరత్ కుమార్ యాదవ్  వద్ద ఉన్న తుపాకీ  గురించి  పోలీసులు ఆరా తీస్తున్నారు.  భరత్ కుమార్ యాదవ్ పై  కూడా  ఇటీవల కాలంలో  ఆరోపణలు  వస్తున్నాయి.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  భరత్ కుమార్ యాదవ్ ను   సీబీఐ అధికారులు ప్రశ్నించిన  విషయం తెలిసిందే. వైఎస్ వివేకా కేసులో నిందితుడు  సునీల్ యాదవ్  కు భరత్ కుమార్  యాదవ్  బంధువు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!