గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి ఏపీపీఎస్సీ..

Published : Mar 28, 2023, 03:28 PM IST
 గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి ఏపీపీఎస్సీ..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయాన్ని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయాన్ని ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నట్టుగా తెలిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు జరగాల్సి ఉంది. అయితే గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని.. తాము ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయం ఇవ్వాలని మెయిన్స్‌కు క్వాలిఫై అయిన పలువురు అభ్యర్థులను ఏపీపీఎస్సీని కోరుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఇదే విధమైన డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు సివిల్స్-2022 ఫేజ్ 3 ఇంటర్వ్యూలను ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు నిర్వహించనున్నట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి 25 మంది గ్రూప్-1 అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ  నేపథ్యంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ దృష్ట్యా గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నట్టుగా తెలిపింది. జూన్ 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్‌ను నిర్వహించనున్నట్టుగా వెల్లడించింది.

ఇక, గ్రూప్-1 పోస్టుల కోసం ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జనవరి 8న నిర్వహించింది. ఆ తర్వాత కేవలం 20 రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటించింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu