భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజూ కొనసాగుతుంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. వర్షంలోనే రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించారు.
కర్నూల్: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతుంది .బుధవారంనాడు ఉదయం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ వర్షంలోనే పాదయాత్ర కొనసాగించారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం వర్షం కురిసింది . ఇవాళ ఉదయం ఆదోని మండలం చాగి నుండి ఆదోని మండల కేంద్రానికి రాహుల్ పాదయాత్రచేరుకుంది.10కి.మీ .వర్షంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. ఆదోని మండలకేంద్రంలో రాహుల్ గాంధీకి మధ్యాహ్నం బస ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం ఆరేకల్ లో రాహుల్ గాంధీ స్థానికులతో సమావేవం కానున్నారు .ఇవాళ రాత్రికి ఎమ్మిగనూరులో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
ఇవాళ రాహుల్ గాంధీ పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క పాలోన్నారు. నిన్న నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.రాహుల్ పాదయాత్రలో కర్ణాటకకు చెందిన నేతలు కూడ ఉన్నారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు 119 కి.మీ పాదయాత్ర సాగనుంది . ఈ నెల 22 న పాదయాత్ర కర్ణాకట రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23న కర్ణాటకలోని రాయిచూరు నుండి తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.
undefined
నిన్న రాహుల్ గాంధీతో పోలవరం నిర్వాసితులు,అమరావతి రైతులు సమావేశమయ్యారు .తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు .
alsoread:ఏపీలోకి భారత్ జోడో యాత్ర:కర్నూల్ లో నాలుగు రోజుల పాటు రాహుల్ పాదయాత్ర
ఈ ఏడాడి సెప్టెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడుు రాష్ట్రంలోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తమిళనాడు,కేరళ,కర్ణాటక రాష్ట్రాల మీదుగా పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నెల 14న కూడ రాహలు్ గాంధీ పాదయాత్ర పాక్షికంగా రాష్ట్రంలో సాగింది. అనంతపురం జిల్లాలోని ఓబులాపురం నుండి రాష్ట్రంలోకి ప్రవేశించిన పాదయాత్ర 18కి.మీ సాగింది. అనంతపురం జిల్లాలోని డి.హీరేలాల్ మండలంలోని పలుగ్రామాల నుండి యాత్ర సాగింది .ఈ గ్రామాల గుండా యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించిన విషయంతెలిసిందే.