అనంతపురంలో ఎలుగుబంటి హల్ చల్: పరుగుతీసిన స్థానికులు

Published : Jan 24, 2020, 11:58 AM IST
అనంతపురంలో ఎలుగుబంటి హల్ చల్: పరుగుతీసిన స్థానికులు

సారాంశం

అనంతపురం జిల్లాలో ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది.  రెండు గంటల పాటు స్థానికులు భయంతో పరుగులు తీశారు. 

అనంతపురం: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం టి. వీరాపురంలోని ఓ రైతు  ఇంట్లో  శుక్రవారం నాడు ఉదయం ఓ ఎలుగుబంటి దూరింది. ఎలుగుబంటి  ఇంట్లో దూరిన విషయం తెలుసుకొన్న స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

 అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి అనంతపురం జిల్లాలో శుక్రవారం నాడు స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.  అనంతపురం జిల్లాలోని ఓ రైతు ఇంట్లో ఎలుగుబంటి దూరింది.

శుక్రవారం నాడు ఉదయం ఈ విషయాన్ని ఇంటి యజమాని గుర్తించాడు. వెంటనే స్థానికులతో సహాయంతో ఎలుగుబంటిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, ఎలుగుబంటి గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేసింది.

రెండు గంటల పాటు ఎలుగుబంటి గ్రామంలో హల్ చల్  చేసింది.. రెండు గంటల పాటు గ్రామంలోకి వచ్చిన విషయాన్ని స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖాధికారులు ఎలుగుబంటిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎలుగు బంటి గ్రామంలో హల్ చల్ చేయడంతో  స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని  పరుగులు తీశారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త