బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఉదయమే తాడేపల్లికి చేరుకున్నారు. ఏపీ నుండి ఆర్. కృష్ణయ్యను వైసీపీ పంపనుందని సమాచారం.
అమరావతి: BC Sankshema Sangam అధ్యక్షుడు R. Krishnaiah ఏపీ సీఎం YS Jagan తో మంగళవారం నాడు భేటీ కానున్నారు. రాష్ట్రం నుండి ఖాళీ కానున్న నాలుగు Rajya Sabha స్థానాల్లో ఒక్క స్థానం నుండి ఆర్. కృష్ణయ్యకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఆర్. కృష్ణయ్యకు కేటాయిస్తారని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో జగన్ తో భేటీ కావడానికి ఆర్. కృష్ణయ్య రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలకు కేటాయించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోమవారం నాడు రాత్రే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయమై సీఎం జగన్ తో చర్చించారని సమాచారం.
undefined
ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నాడు. రాజకీయంగా బీసీలను తన వైపునకు తిప్పుకొనేందుకు గాను బీసీలకు పెద్దపీట వేస్తున్నాడని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆర్., కృష్ణయ్యతో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావుకి కూడా రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం ఉందని సమాచారం. బీద మస్తాన్ రావును కూడా ఇవాళ తాడేపల్లికి రావాలని జగన్ కబురు పంపినట్టుగా తెలుస్తుంది.
పార్టీ ఆవిర్భావం నుండి TDPకి బీసీలు వెన్నంటి ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో BC ఓటు బ్యాంకు YCP వైపునకు మళ్లింది. దీంతో ఈ ఓబు బ్యాంకును తమ వైపే సుస్థరం చేసుకొనేందుకు గాను జగన్ బీసీలకు పదవుల్లో పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్. కృష్ణయ్యకు సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో సాగుతుంది.
2014 ఎన్నికలకు ముందు ఆర్. కృష్ణయ్య టీడీపీలో చేరారు. తెలంగాణలోని ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుండి ఆర్. కృష్ణయ్య టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో ఆర్. కృష్ణయ్య టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలోనే ఆర్.కృష్ణయ్య కు Congress పార్టీ టికెట్ ఇచ్చింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి ఆర్. కృష్ణయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
గత కొంత కాలంలో ఆర్. కృష్ణయ్య వైఎస్ జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీసీలకు అనుకూలంగా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇవాళ ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యేందుకు హైద్రాబాద్ నుండి ఆర్. కృష్ణయ్య తాడేపల్లికి చేరుకున్నారు. జగన్ తో భేటీ తర్వాత రాజ్యసభ సీటు విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.