రేవతి ఎఫెక్ట్: రేపు విజయవాడలో జరగాల్సిన బీసీ సంక్రాంతి సభ వాయిదా

Published : Dec 10, 2020, 02:40 PM IST
రేవతి ఎఫెక్ట్: రేపు విజయవాడలో జరగాల్సిన బీసీ సంక్రాంతి సభ వాయిదా

సారాంశం

విజయవాడలో రేపు జరగాల్సిన బీసీ సభ, బీసీ సంక్రాంతి సభ వాయిదా పడింది. వడ్డెర కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ ఘటన వల్లే ఈ పరిస్థితి నెలకొందనే ప్రచారం సాగుతోంది.

అమరావతి: విజయవాడలో రేపు జరగాల్సిన బీసీ సభ, బీసీ సంక్రాంతి సభ వాయిదా పడింది. వడ్డెర కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ ఘటన వల్లే ఈ పరిస్థితి నెలకొందనే ప్రచారం సాగుతోంది.

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 56 బీసీ కులాలకు చైర్మెన్ పదవులను ఇచ్చింది. కార్పోరేషన్ చైర్మెన్ పదవులను ప్రభుత్వం ప్రకటించింది. కార్పోరేషన్ ఛైర్మెన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకారోత్సవం  ఈ నెల 11వ తేదీన విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

also read:టోల్‌ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యం: వడ్డెర కార్పోరేషన్ ఛైర్‌పర్సన్‌పై కేసు

అయితే వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ రేవతి కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా సిబ్బందితో వ్యవహరించిన తీరుతో ఈ సభను వాయిదా వేసినట్టుగా సమాచారం.బీసీ సంక్రాంతి సభ పేరుతో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేశారు. రేవతి వ్యవహరించిన తీరు విమర్శలకు తావివ్వడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.,

గతంలో కూడ పలుమార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. కానీ కొన్ని కారణాలతో వాయిదా వేశారు. రేపు నిర్వహించాల్సిన కార్యక్రమం రేవతి కారణంగా వాయిదా పడింది. రేవతి తీరుపై వైసీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొందని సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu