జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

By narsimha lodeFirst Published Dec 10, 2020, 12:16 PM IST
Highlights

పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు.

అమరావతి: పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు.

జగనన్న జీవక్రాంతి పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి కల్పించందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు. 

also read:మరో పథకానికి జగన్ సర్కార్: నేడు జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభం

వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రైతుల్లో మరింత ఆర్ధిక అభివృద్ది రానుందన్నారు.  గత ప్రభుత్వాలు ఈ అంశాలను నిర్లక్ష్యం చేశాయన్నారు.అమూల్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాడి రైతులకు మహిళలకు ఆర్ధికంగా చేయూత అందనుందని సీఎం చెప్పారు. 

ఈ పథకం కింద 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేయనున్నామన్నారు.  రూ. 1,869 కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేస్తామని సీఎం ప్రకటించారు.45 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు వయస్సున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మహిళలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేయనున్నారు.

click me!