భగ్గుమన్న బిసి సంఘాలు

First Published Dec 2, 2017, 1:41 PM IST
Highlights
  • బిసి సంఘాలు భగ్గుమన్నాయి.

బిసి సంఘాలు భగ్గుమన్నాయి. కాపులను బిసిల్లో చేర్చాలన్న చంద్రబాబునాయుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ బిసి సంఘాలు శనివారం మెరుపు ఆందోళనకు దిగాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో బిసి సంఘాల కార్యకర్తలు చంద్రబాబబు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. కాకినాడలోని కలెక్టరేట్ మార్గంలో ప్రయాణిస్తున్నపలు వాహనాలను నిలిపేస్తున్నారు. కొన్ని వాహనాల టైర్లకు ఆందోలన కారులు నిప్పంటించటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు.

శనివారం అసెంబ్లీ సమావేశాల్లో కాపులను బిసిల్లోకి చేరుస్తూ మంజూనాధ కమీషన్ రిపోర్టుకు సభ ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. కాపులను బిసిల్లోకి చేర్చటం వల్ల బిసిలకు అన్యాయం జరుగటం ఖాయంగా బిసి సంఘాల నేతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతులకు నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి. బీసీల మెరుపు ముట్టడితో కలెక్టరేట్‌ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంఘాలు భారీ ఎత్తున పాల్గొన్నాయి.

 

click me!