చంద్రబాబు గారు... మనం కూడా ఇంతకు ఇంత చేయాలి: గౌరు దంపతులు

By Arun Kumar PFirst Published May 26, 2021, 4:00 PM IST
Highlights

వైసిపి నాయకులు ఎస్సీ, ఎస్టీల భూములను ఆక్రమించడం, వారి పొలాలకు నీరందకుండా చేయడాన్ని జనార్థన్ రెడ్డి అడ్డుకోవడం వలనే తాజాగా అరెస్టయ్యారని గౌరు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 

కర్నూల్: బనగానపల్లెలో అధికార అండతో వైసిపి నాయకులు అక్రమ లేఅవుట్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని... వీటిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నందుకే బిసి జనార్థన్ రెడ్డిని టార్గెట్ చేశారని టిడిపి నాయకులు గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీల భూములను ఆక్రమించడం, వారి పొలాలకు నీరందకుండా చేయడాన్ని జనార్థన్ రెడ్డి అడ్డుకున్నారని... మీడియా సమక్షంలోనే అధికారులను నిలదీశారన్నారు. అవన్నీ మనసులో పెట్టుకొనే ఆయన ఇంటిపైకి దాడి చేయడానికి వెళ్లారని... తిరిగి ఆయనపైనే కేసు పెట్టి అరెస్ట్ చేశారని వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

''వైసీపీ ప్రభుత్వం వచ్చాక బనగానపల్లె నియోజకవర్గం సహా కర్నూలు పార్లమెంట్  పరిధిలో లెక్కకు మిక్కిలి ఘటనలు జరుగుతున్నాయి. ఎవరైనా అధికారులు న్యాయంగా టీడీపీవారి ఫిర్యాదులపై స్పందిస్తే, వారిపై కూడా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకత్వం వెంటనే స్పందించింది'' అని వెంకట్ రెడ్డి తెలిపారు. 

read more  జాగ్రత్త... రిటైరయి ఎక్కడికెళ్లినా వదిలేది లేదు...: పోలీసులకు అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

ఇక మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కూడా జనార్ధన్ రెడ్డి అరెస్ట్ పై స్పందిస్తూ... వైసిపి ప్రభుత్వం వచ్చింది మొదలు ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూనే ఉందన్నారు.జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి తొలినుంచీ నియోజక వర్గాన్ని, పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అందువల్లే వారిపై వైసిపి నాయకులు కక్ష్య పెంచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతకు ఇంత వైసీపీ వారికి చూపించాలని అధిష్టానాన్ని కోరుతున్నామని చరితారెడ్డి తెలిపారు.

''ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి వదిలేసి ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది. జనార్థన్ రెడ్డి కుటుంబానికి జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. మా నియోజకవర్గంలో కూడా చిన్నచిన్నవాటికే తమపై కేసులు పెడుతున్నారు. ఇంకా ఈ ప్రభుత్వాన్ని మూడేళ్లు భరించాలి'' అని చరితారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  

click me!