షాక్: ఎపి వెబ్ సైట్ నుంచి 1.34 లక్షల ఆధార్ హోల్డర్ల బ్యాంక్ వివరాలు లీక్

First Published Apr 26, 2018, 12:13 PM IST
Highlights

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ప ఇండియా చెప్పిన విషయానికి జరుగుతున్న సంఘటనలకు పొంతన లేకుండా పోతోంది. 

అమరావతి: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ప ఇండియా చెప్పిన విషయానికి జరుగుతున్న సంఘటనలకు పొంతన లేకుండా పోతోంది. ఆధార్ వివరాలు లీక్ కావడం గానీ, వాటిని దుర్వినియోగం చేయడం గానీ జరగదని ఆ సంస్థ ప్రకటించింది.

అందుకు విరుద్ధంగా 1.34 లక్షల ఆధార్ కార్డుల వివరాలు లీకయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ వెబ్ సైట్ నుంచి ఆ వివరాలు లీకయినట్లు తెలుస్తోంది. 

వెబ్ సైట్ లో హుద్ హుద్ పథకం కింద ప్రయోజనం పొందేవారి జాబితాకు సంబంధించిన వివరాలు లీకైనట్లు తెలుస్తోంది. ఆధార్ నెంబర్, బ్యాంక్ శాఖ, ఐఎఫ్ఎస్ సి కోడ్, ఖాతా నెంబర్, రేషన్ కార్డు నెంబర్, వృత్తి, మతం, కులం వంటి వివరాలననీ బయటకు వచ్చాయి. 

ఈ లీక్ వ్యవహారాన్ని సైబర్ సెక్యురిటీ పరిశోధకుడు శ్రీనివాస్ కొడాలి ఆ విషయాన్ని వెల్లడించినట్లు దక్కన్ క్రానికల్ రాసింది. ఆ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లు ఎన్డీటీవి రాసింది. 

click me!