సూళ్లూరుపేట కౌన్సిలర్ సురేష్ హత్య: నిందితుడు బాలు లొంగుబాటు

Published : Aug 11, 2021, 11:21 AM ISTUpdated : Aug 11, 2021, 11:42 AM IST
సూళ్లూరుపేట కౌన్సిలర్ సురేష్ హత్య: నిందితుడు బాలు లొంగుబాటు

సారాంశం

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వైసీపీ కౌన్సిలర్ సురేష్ హత్య కేసులో బాలు అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.  ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వైసీపీ కౌన్సిలర్ సురేష్ హత్య కేసులో  బాలు అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.  తానే ఈ హత్య చేసినట్టుగా బాలు పోలీసులకు చెప్పారు.రెండు రోజుల క్రితం పుట్టిన రోజునే కౌన్సిలర్ సురేష్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ కారును నిందితుడు  వెంబడించిన విషయాన్ని పోలీసులు సీసీటీవీ పుటేజిలో గుర్తించారు.

also read:పుట్టినరోజునేదారుణ హత్య: సూళ్లూరుపేటలో వైసీపీ కౌన్సిలర్ సురేష్ హత్య

చెన్నైకి సమీపంలోని ఎన్నూరు వద్ద బాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తడ మండలానికి చెందిన బాలు కొంతకాలంగా సూళ్లూరుపేటలో ఉంటున్నారు. సూళ్లూరుపేటలోని ఓ క్లబ్ లో కోలాటం నేర్పే మాష్టర్ గా పనిచేస్తున్నాడు. కౌన్సిలర్ సురేష్ ఇంట్లోని కింది పోర్షన్ లో అద్దెకు ఉంటున్నాడు. కౌన్సిలర్ సురేష్  ఆర్ధిక లావాదేవీల్లో బాలు బినామీగా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. సురేష్ హత్యకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. బాలును పోలీసులు విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu