
నంద్యాలలో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం స్టార్ క్యాంపైనర్ దిగుతున్నారు. షూటింగుల బిజిలో ఉన్నప్పటికీ నందమూరి బాలకృష్ణ ఉపఎన్నికలో ప్రచారం చేయటానికి అంగీకరించారు. ఈనెల 16వ తేదీన నంద్యాల, గోస్పాడు మండలాల్లో బాలకృష్ణ రోడ్డుషోలో పాల్గొంటున్నారు. అయితే, రెండు రోజుల పాటు బాలకృష్ణతో ప్రచారం చేయించాలని స్ధానిక నేతలు అనుకున్నా నటసింహం మాత్రం ఒక్క రోజు మాత్రమే ప్రచారానికి అంగీకరించారు.