ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న బాలకృష్ణ.. లిఫ్ట్ అడిగి...

Published : Dec 21, 2023, 01:18 PM IST
ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న బాలకృష్ణ.. లిఫ్ట్ అడిగి...

సారాంశం

యువగళం విజయోత్సవ సభకు లక్షలాదిగా జనం తరలి రావడంతో వేదికకు దగ్గర్లో ట్రాఫిక్ జామ్ అయింది. వేదిక స్థలానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోని ట్రాఫిక్ జామ్ లో బాలకృష్ణ ఇరుక్కుపోయారు.

పరవాడ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. బుధవారం నాడు జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న పరవాడలో జరిగిన యువగళం విజయోత్సవ సభ ‘నవ శకం’ కార్యక్రమానికి హాజరవ్వడానికి బాలకృష్ణ వస్తున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి పోలిపల్లిలోని సభా వేదిక వద్దకి బాలకృష్ణ కారులో బయలుదేరారు యువగళం విజయోత్సవ సభకు లక్షలాదిగా జనం తరలి రావడంతో వేదికకు దగ్గర్లో ట్రాఫిక్ జామ్ అయింది. వేదిక స్థలానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోని ట్రాఫిక్ జామ్ లో బాలకృష్ణ ఇరుక్కుపోయారు.

ఆ సమయంలోనే అటుగా పరవాడ టిడిపి నాయకులు సన్యాసి అప్పారావు,   రాములు వెళుతున్నారు. అయితే అప్పటికే బాలకృష్ణ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడం గమనించిన పోలీసులు వీరిద్దరిని ఆపారు. వీరు ప్రధాన రోడ్డు గుండా పెడుతున్నారు. దీంతో బాలకృష్ణను తీసుకువెళ్లి వీఐపీ గేటు దగ్గర దింపాలని పోలీసులు వారిని కోరారు. వెంటనే స్పందించిన సన్యాసి అప్పారావు బాలకృష్ణతో పాటు అతని ఇద్దరు పీఏ లను కారులో ఎక్కించుకొని వీఐపీ గేటు దగ్గరికి తీసుకెళ్లి దించారు.

ఈ శాంతాక్లాజ్ ఎవరో గుర్తుపట్టండి??

అక్కడి నుంచి బాలకృష్ణ వేరే కారులో సభ వేదిక దగ్గరికి వెళ్లారు. దీనిమీద సన్యాసి అప్పారావు మాట్లాడుతూ కారులో వెళుతున్న సమయంలో తమది ఏ నియోజకవర్గమని  బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. దీనికి పెందుర్తి నియోజకవర్గం అని చెప్పానని… హైదరాబాద్ ఎప్పుడైనా వస్తే తనని కలవాలని.. పెందుర్తి యువగళం రథసారధి అని చెబితే తన వద్దకు పంపిస్తారని బాలకృష్ణ వారికి తెలిపారట. ఈ మేరకు సన్యాసి అప్పారావు సంతోషంగా చెప్పుకొచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!