Badvel Nellore Highway Project: 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Published : May 29, 2025, 12:41 AM IST
Badvel Nellore Highway Project Approved with Rs 3653 Crore Budget

సారాంశం

Badvel Nellore Highway Project: ఏపీలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-67లోని బద్వేల్-గోపవరం నుంచి ఎన్‌హెచ్-16లోని గురువిందపూడి వరకు 4 లేన్ల బద్వేల్-నెల్లూరు రహదారిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Badvel Nellore Highway Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 3653.10 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్ 67లో 108.134 కి.మీ పొడవున 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్ నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిని డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో చేపట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పారిశ్రామిక ప్రాంతాలైన విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక ప్రాంతం (వీసీఐసీ)లోని కొప్పర్తి, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక ప్రాంతం (హెచ్‌బీఐసీ)లోని ఓర్వకల్, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక ప్రాంతంలోని (సీబీఐసీ) కృష్ణపట్నంలను ఇది అనుసంధానించనుంది. ఇది దేశంలోని సరుకురవాణా పనితీరు సూచిక (ఎల్‌పీఐ)పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

బద్వేల్- నెల్లూరు కారిడార్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రస్తుత జాతీయ రహదారి ఎన్‌హెచ్-67లోని గోపవరం గ్రామం వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఎన్‌హెచ్-16 (చెన్నై-కోల్‌కతా)లోని కృష్ణపట్నం ఓడరేవు జంక్షన్ వద్ద ముగుస్తుంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక ప్రాంతం (సీబీఐసీ) కింద ప్రాధాన్యతా నోడ్‌గా గుర్తించిన కృష్ణపట్నం ఓడరేవుకు వ్యూహాత్మక అనుసంధానతను కూడా అందిస్తుంది.

ప్రతిపాదిత కారిడార్ కృష్ణపట్నం ఓడరేవుకు ప్రయాణ దూరాన్ని ప్రస్తుత బద్వేల్-నెల్లూరు రహదారితో పోలిస్తే 142 కి.మీ నుంచి 108.13 కి.మీలకు అంటే 33.9 కి.మీలు తగ్గిస్తుంది. ఇది ప్రయాణ సమయాన్ని ఒక గంట తగ్గించనుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా కర్బన ఉద్గరాలు, వాహన నిర్వహణ ఖర్చు (వీఓసీ) తగ్గి మొత్తంగా గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూసిస్తుంది.

108.134 కి.మీ.ల ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 20 లక్షల పని దినాలు, పరోక్షంగా 23 లక్షల పని దినాల ఉపాధి లభించనుంది. ప్రతిపాదిత కారిడార్ పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా అదనపు ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే