Badvel bypoll: బీజేపీ, జనసేన మధ్య కుదరని ఏకాభిప్రాయం, కొనసాగనున్న చర్చలు

By narsimha lode  |  First Published Sep 30, 2021, 4:34 PM IST

బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  పోటీ చేసే విషయమై బీజేపీ, జనసేనల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.ఏ పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపాలనే విషయమై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. ఈ స్థానం నుండి రెండు పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్ధి బరిలో దిగుతారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు.


అమరావతి: బద్వేల్ అసెంబ్లీ స్థానానికి (Badvel bypoll) జరిగే ఉప ఎన్నికల్లో   ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై  బీజేపీ (bjp), జనసేనల(jana sena) మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఈ స్థానం నుండి  ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధి బరిలోకి దిగుతారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు (somu veerraju)ప్రకటించారు.

also read:Badvel assembly bypoll: జనసేన పోటీకి బీజేపీ గ్రీన్‌సిగ్నల్?

Latest Videos

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan), జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్(nadendla manohar), బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజులు గురువారంనాడు బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించారు. తిరుపతి పార్లమెంట్ (tirupati ) ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. దీంతో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని తొలుత బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. అయితే ఈ సమావేశంలో మాత్రం ఈ రెండు పార్టీలు పోటీ చేయడంపై ఏకాభిప్రాయం కుదరలేదు.

ఈ రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతాయని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు.  బద్వేల్ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని బీజేపీ నేతలు చెప్పారు.  రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతాయని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు.

click me!