జగన్, పోస్కో కంపెనీకి మధ్య బ్రోకర్ ఆయనే: అయ్యన్న సంచలనం

By Arun Kumar PFirst Published Feb 18, 2021, 4:27 PM IST
Highlights

ఉద్యమంచేస్తున్న కార్మికులకు నేను ఉన్నాను అనే భరోసా కల్పించలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి అయ్యన్న మండిపడ్డారు.

విశాఖ ఉక్కుఫ్యాక్టరీని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడానికి ఉద్యమం జరుగుతుంటే, కార్మికుల గురించి, ఫ్యాక్టరీ గురించి ఒక్కమాటకూడా మాట్లాడని పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంచేస్తున్న కార్మికులకు నేను ఉన్నాను అనే భరోసా కల్పించలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి అని అయ్యన్న మండిపడ్డారు.

''విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడానికి 32మంది ప్రాణత్యాగం చేశారని, అక్కడి రైతులు దాదాపు 28వేల ఎకరాలను పరిశ్రమకోసం ఇచ్చారని, అటువంటి పరిశ్రమ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడిన ముఖ్యమంత్రి, అందుకు సంబంధించిన ఒప్పందంపై కూడా సంతకాలు చేయడం జరిగింది. తప్పుచేసిన ముఖ్యమంత్రి వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరంచేసి, దానిలో వాటాలు కొట్టేయడానికి ప్రయత్నించడం ఎంతటి దుర్మార్గమో ప్రజలంతా ఆలోచించాలి'' అన్నారు.

 ప్రత్యేక విమానంలో వచ్చి సాధువుని కలిసి ఆయనకు దండాలు పెట్టిన ముఖ్యమంత్రి, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను పరామర్శించడానికి రాకపోవడం, బాధ్యతగల ముఖ్యమంత్రిగా వారికి భరోసా కల్పించకలేకపోవడం జగన్ లోని గర్వానికి, అహాంభావానికి నిదర్శనమని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి కార్మికులను, రైతులను కలవకుండా, కేవలం విమానాశ్రయంలో తూతూమంత్రంగా కొందరితో చర్చలు జరపడాన్ని బట్టే, జగన్ నిజస్వరూపం ఏమిటో బట్టబయలైందన్నారు. 

read more   కుప్పంలో వైసీపీ గెలవలేదు, ప్రజాస్వామ్యం ఓడింది: చంద్రబాబు

చంద్రబాబునాయుడు విశాఖ వచ్చి, పల్లా శ్రీనివాసరావుని పరామర్శించి కార్మికులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొనివారికి సంఘీభావం తెలిపారన్నా రు.  తాను సీనియర్ ని అయినప్పటికీ కార్మికులకోసం, విశాఖ ఉక్కుఫ్యాక్టరీకోసం ఒక మెట్టుతగ్గి, జగన్ ప్రభుత్వంతో కలిసి అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటంచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారన్నారు. ఇంకా అవసరమైతే టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయిస్తానని, విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమని చంద్రబాబు చెప్పారన్నారు. 

తప్పు చేశాడు కాబట్టే, విశాఖ వచ్చిన జగన్ కార్మికులకు ముఖం చూపలేక తప్పించుకుపోయాడన్నారు. జగన్ చేస్తున్న మోసాలపై, విశాఖవాసులతో పాటు, రాష్ట్రప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో జగన్ కు, పోస్కో కంపెనీకి మధ్య బ్రోకర్ గా పనిచేసింది ఏ2 విజయసాయిరెడ్డని, అలాంటి పనిచేసిన వ్యక్తి విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కాపాడటానికి పాదయాత్ర చేస్తాననడం దొంగమాటలు, మోసపుచర్యల్లో భాగమేనన్నారు. 

విజయసాయికి, జగన్ కు చేతనైతే ఢిల్లీ వెళ్లి పాదయాత్ర చేయాలన్నారు. ఎన్నికలకు ముందు ఎక్కువమంది ఎంపీలను ఇస్తే, ప్రధాని మెడలు వంచి , రాష్ట్రానికి అవసరమైనవన్నీ సాధిస్తామనిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తనచేతిలో ఉన్న ఎంపీలతో కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకోసం మోదీ వద్దకు ఎందుకు వెళ్లలేకపోతున్నాడన్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ని కాపాడుకోవాల్సిన ఆంధ్రులందరిపై ఉందని, వారంతా సమిష్టిగా కదిలి, జగన్ ప్రభుత్వానికి బుద్ధివచ్చేలా, కేంద్రం దిగివచ్చేలా పోరాటం చేయాలని మాజీమంత్రి అయ్యన్న పిలుపునిచ్చారు.
 

click me!