బీజేపీకి వ్యతిరేకంగానే స్టీల్ ప్లాంట్ ఉద్యమం: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 18, 2021, 03:31 PM IST
బీజేపీకి వ్యతిరేకంగానే స్టీల్ ప్లాంట్ ఉద్యమం: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రైవేటీకరణ అని చంద్రబాబు, కమ్యూనిస్టులే అంటున్నారని వీర్రాజు చెప్పారు

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రైవేటీకరణ అని చంద్రబాబు, కమ్యూనిస్టులే అంటున్నారని వీర్రాజు చెప్పారు.

బీజేపీని వ్యతిరేకించాలనే స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దాడులకు పాల్పడుతోందని.. ఎన్నికల ముందు సంక్షేమ పథకాల పేరుతో రూ.35 వేల కోట్లు విడుదల చేసిందని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. 

కొద్దిరోజుల ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన...  స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ ఉక్కుమంత్రిని ఏపీ బీజేపీ నేతలు కలిశారు.

ప్రజల సెంటిమెంట్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల విలీనం తరహాలోనే స్టీల్‌ప్లాంట్‌ విలీనం ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీల ఆందోళనలను వివరించామని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే