షాక్: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ వైసీపీకి గుడ్‌బై

Published : Feb 18, 2021, 03:37 PM IST
షాక్: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ వైసీపీకి గుడ్‌బై

సారాంశం

మాజీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

విజయనగరం: మాజీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

వైసీపీ నాయకత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన మీడియాకు వివరించారు.  కార్యకర్తలతో సమావేశం తర్వాత  ఏ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటించనున్నట్టుగా ఆయన తెలిపారు.

ఏపీ డిఫ్యూటీ సీఎం పుష్పశ్రీవాణి భర్త పరిక్షిత్‌రాజు శత్రుచర్ల చంద్రశేఖరరాజును  బుజ్జగిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం శత్రుచర్ల కుటుంబానికి కంచుకోట.ఈ స్థానం నుండి అత్యధికంగా శత్రుచర్ల విజయరామరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

ఈ స్థానం నుండి శత్రుచర్ల విజయరామరాజు మినహా ఎవరూ కూడ ఒక్కసారి కంటే ఎక్కువ దఫాలు విజయం సాధించలేదు. శత్రుచర్ల కుటుంబం నుండే ఈ స్థానం నుండే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. శత్రుచర్ల విజయరామరాజు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. శత్రుచర్ల విజయరామరాజు తమ్ముడు చంద్రశేఖరరాజు 1989లో ఈ స్థానం నుండి ెమ్మెల్యేగా విజయం సాధించారు. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే