దేవాలయాలపై దాడులు...ఆ పాస్టర్ వెనక సీఎం బంధువులు: అయ్యన్న సంచలనం

By Arun Kumar PFirst Published Jan 17, 2021, 1:46 PM IST
Highlights

నామాలు పెట్టుకుని గోపూజలు చేస్తే కాదు... పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వంటి వాడిని శిక్షిస్తే ప్రజలు మీరు క్రీస్టియన్ అయినా హిందువులు పట్ల మీకు గౌరవం ఉందని నమ్ముతారు అని సీఎం జగన్ కు సూచించారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.

విశాఖపట్నం: హిందూ దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న దాడులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఈ దాడులన్ని చేసింది తానేనంటూ స్వయంగా ఒప్పుకున్న పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వెనకున్న వారు ఎవరో తెలిపాలని డిజిపిని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికన డిజిపి గౌతమ్ సవాంగ్ కు పలు ప్రశ్నలు సంధించారు అయ్యన్నపాత్రుడు.

''హిందూ దేవుళ్ళ విగ్రహాలను నేను పగలుగొట్టాను, కాలితో తన్నాను, మత మార్పిడులు చేసాను అని చెప్పిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసి నాలుగు రోజులు అయ్యింది. ఇతన్ని ఎందుకు ఇప్పటి వరకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు? ఇతని వెనుక ఎవరు ఉన్నారు?'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు.
 
''ఇతని వెనుకు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సియం దగ్గర బంధువుల వివరాలు ఎప్పుడు మీడియాకు చెప్తున్నారు ? అసలు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరాచకాలు గురించి వైసీపీ పార్టీలో ఒక్కడు కూడా ఎందుకు స్పందించటం లేదు?'' అని ప్రశ్నించారు.
 
''నామాలు పెట్టుకుని, గోపూజలు చేస్తే కాదు, ఇలాంటి వాడిని శిక్షిస్తే ప్రజలు, మీరు క్రీస్టియన్ అయినా హిందువులు పట్ల మీకు గౌరవం ఉందని ప్రజలు నమ్ముతారు. ముందు ఈ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాఫియాని బయట పెట్టండి'' అని డిమాండ్ చేశారు. 
 
''ఉదయం గుండెపోటు అంటారు, సాయంత్రానికి గొడ్డలిపోటు అంటారు.నిన్న పిచ్చోళ్ళు, జంతువులు విగ్రహాలు పగలగోట్టాయి అంటారు, నేడు టిడిపి వాళ్ళు చేసారు అంటారు. వైఎస్ జగన్ మడమ తిప్పినంత ఈజీగా, స్క్రిప్ట్ ని ఈ విధంగా మార్చటం, తాడేపల్లి ప్యాలెస్ కే చెల్లింది.నిజాలు మాత్రం ఎప్పటికీ బయటకు రావు''
 
''గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ కాదు.. వైపీఎస్ అనేది ఇందుకే. పాస్టర్ ప్రవీణ్ వైసీపీ ఎంపీతో వున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకులే విగ్రహాల ధ్వంసం, పూజారులపై దాడి కేసులో నిందితులు,మరి వారి పేర్లేవి జాబితాలో సవాంగమన్న.విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిని నిందితులుగా చూపించడం మీ చేతకాని తనానికి నిదర్శనం.విగ్రహాల దాడి వెనుక రాజకీయ కుట్ర లేదన్న ఒక్కరోజులోనే నాలుక మడత పడింది ఎందుకు డిజిపి గారు?పోస్టు పీకేస్తాం అంటూ తాడేపల్లి ప్యాలస్ నుండి వార్నింగ్ వచ్చిందా?'' అంటూ డిజిపిని ప్రశ్నించారు అయ్యన్న.


 

click me!