సవాంగ్‌ను డీజీపీ పోస్టు నుండి తొలగించాలి: సోము వీర్రాజు ఫైర్

By narsimha lode  |  First Published Jan 17, 2021, 10:36 AM IST

హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలని డీజీపీ అనుకొంటున్నారా అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. డీజీపీని వెంటనే ఆ పోస్టును తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 


విశాఖపట్టణం: హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలని డీజీపీ అనుకొంటున్నారా అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. డీజీపీని వెంటనే ఆ పోస్టును తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఆదివారం నాడు ఆయన  తిరుపతిలో మీడియాతో మాట్లడారు. ఎప్పుడు ధ్వంసం చేసిన విగ్రహాలకు సంబంధించిన కేసులకు సంబంధించి తమ నేతలపై కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. విగ్రహాల ధ్వంసం కేసులో ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదనడానికి ఇది అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వ చర్య పనికిమాలిన చర్యగా ఆయన పేర్కొన్నారు.

Latest Videos

undefined

తిత్లీ తుఫాన్ లో విగ్రహం ధ్వంసమైందని సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసు పెట్టారని ఇది సరైందా అని ఆయన ప్రశ్నించారు.  దేవాలయాల్లో, ఇతర చోట్ల విగ్రహాలను తాము ధ్వంసం చేశామని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హిందూ సమాజాన్ని అస్థిర పర్చడమా, నిర్వీర్యం చేయడమో పనిగా పెట్టుకొన్నారని ఇటీవల చోటు చేసుకొన్న ఘటనలను బట్టి అర్ధమౌతోందన్నారు.తమ పార్టీ ముస్లింలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదన్నారు. దళిత క్రిస్టియన్లు అనేది రాజ్యాంగ విరుద్దమైన పదమని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

హిందూ సంస్థలకు ఎన్ని ఆస్తులున్నాయో ప్రభుత్వం లెక్కలు తీస్తోన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఇదే తరహాలో క్రిస్టియన్  మిషనరీ ఆస్తుల లెక్కలు కూడా తీయాలని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాజమండ్రిలో ఓ విగ్రహం ధ్వంసమైతే మూడు పార్టీల నేతలు పూజారిని తీసుకెళ్లి సంప్రోక్షణ చేయించారన్నారు. ఈ ఘటనలోనూ బీజేపీ కార్యకర్తను అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేశారు.తిరుమల వెంకన్న ప్రాంగణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా  క్రిస్‌మస్ శుభాకాంక్షలను  ఇద్దరు మంత్రులు చెప్పారని ఇది సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.
 

click me!