జగనాసుర పాలన అంతానికి అక్కడి నుండే నాంది: మంతెన హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jan 17, 2021, 10:52 AM IST
Highlights

గాంధీ మార్గంలో పోరాడుతున్న దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఎక్కడా లేదంటూ టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు. 
 

అమరావతి: రాజధానిని విచ్ఛిన్నం చేయడానికే మూడు రాజధానులంటూ డ్రామాలాడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆరోపించారు. జగనాసుర పాలన అంతానికి అమరావతి నుండే నాంది పలుకుతామన్నారు మంతెన.  

''రాష్ట్ర భవిష్యత్తు అయిన రాజధానిపై కులతత్వాన్ని రెచ్చగొట్టి ఏం మూటకట్టుకున్నారు?  అసత్యాలు ప్రచారం చేసి రాష్ట్రాభివృద్ధిని నాశనం చేశారు. 397 రోజులగా రైతులు చేస్తున్న ఉద్యమం మాటల్లో చెప్పలేనిది. గాంధీ మార్గంలో పోరాడుతున్న దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఎక్కడా లేదు. రైతులు చేస్తున్న ఉద్యమం ముందు కృత్రిక ఉద్యమాలు తట్టుకోలేవు. రాజధాని విషయంలో తప్పు చేశామా? అని తల పట్టుకునే రోజు వైసీపీకి వస్తుంది'' అని హెచ్చరించారు. 

''అభివృద్ది వికేంద్రీకరణ ముసుగుతో రాజకీయ క్రీడలో రాజధాని బలిచెయ్యడం సిగ్గుమాలిన చర్య. పలానా నగరం మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితి లేకుండా వైసీపీ చేసింది. మూడు రాజధానుల అభివృద్ది వికేంద్రీకరణ ఎండమావిలో నీటి వంటిదే'' అన్నారు.

''కక్ష సాధింపులు రాష్ట్రానికి మంచిది కాదు. చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాలకు ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర ప్రయోజనాలు బలిపెడుతున్నారు. రాజధాని నుండి ఆదాయం సమకూరితే రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయన్న విషయం పాలకులు గ్రహించాలి. రాజధాని శంకుస్థాపనకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చర్చిలు, దేవాలయాలు, మసీదుల నుండి మట్టిని తెచ్చారు.  కానీ జగన్ రెడ్డి ప్రజల ఇష్టాన్ని పక్కన పెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఏకైక పార్టీ టీడీపీ. అభివృద్ధిలో వైసీపీ పోటీపడలేక ప్రాంతీయ, కుల విధ్వేశాలు రెచ్చగొడుతోంది'' అని మంతెన ఆరోపించారు.

click me!