ఆ రాష్ట్రాలు మిమ్మల్ని అందుకే ఆదర్శంగా తీసుకున్నాయా?: విజయసాయికి అయ్యన్న కౌంటర్

By Arun Kumar PFirst Published Jul 16, 2020, 1:38 PM IST
Highlights

విద్యుత్ విషయంలో మరోసారి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. 

విశాఖపట్నం: విద్యుత్ విషయంలో మరోసారి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విద్యుత్ ఛార్జీల విషయంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటినుండి ఈ మాటల యుద్దం మరీ ఎక్కువయ్యింది. ఈ క్రమంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వేలకోట్లు ఆదా చేశామన్న ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. 

''జగన్ రెడ్డి గారు చౌక ధరలకు విద్యుత్ కొని 6 వేల కోట్లు ఆదా చేసారా? మరి కేంద్ర మంత్రి గారు ఊరందరిది ఒక దారి అయితే జగన్ రెడ్డి గారిది మరోదారి అంటున్నారు ఎందుకు?'' అంటూ ట్విట్టర్ వేదికన అయ్యన్న ప్రశ్నించారు. 

read more   చిత్తూరులో దళిత న్యాయమూర్తిపై వైసిపి దాడి... నారా లోకేష్ సీరియస్

''రూ 2.70 కే కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్ అందిస్తుంటే మీరు అధిక ధరలకు కొనడమే కాకుండా ప్రజల నుండి యూనిట్ కి రూ.9 వసూలు చేస్తున్నారు అని కేంద్ర మంత్రి ప్రకటించారు. విద్యుత్ కొనుగోళ్లు, అధిక బిల్లుల వసూళ్లతో 13 నెలల్లో సుమారుగా 30 వేల కోట్లు దండుకున్నారు''  అని ఆరోపించారు. 

''పీపీఏల్లో వేలు పెట్టి చివాట్లు తిన్నందుకు 8 రాష్ట్రాలు మిమల్ని ఆదర్శంగా తీసుకున్నాయా?పేదల ముక్కు పిండి విద్యుత్ ఛార్జీలు బాదుతున్నందుకు ఆదర్శంగా తీసుకున్నారా?గత ప్రభుత్వంపై ఏడుపుగొట్టు వ్యాఖ్యలు ఎందుకు సాయిరెడ్డి గారు.విద్యుత్ బిల్లులు వసూలు చెయ్యడానికి జగన్ రెడ్డి,సాయి రెడ్డి వెలితే వాస్తవాలు తెలుస్తాయి'' అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 
 

click me!