
అమీర్‌పేట ఎడిటింగులు.. మార్కాపురం మార్ఫింగ్ లు.. ఇంకెన్నాళ్లీ జగన్నాటకం - ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేధికగా మంత్రి రోజాపై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘రోజా ఆంటీ అరంగుళం మేకప్ వేసుకుని వచ్చేయడానికి ఇది జబర్దస్త్ షో కాదు.
స్క్రిప్ట్ లో డైలాగులతో ఉతికేయడానికి ఇది బతుకుజట్కా బండి షో కాదు. దొంగ పెట్టిన దొంగ చానల్ సాక్షి వాళ్ల స్క్రిప్టు పట్టుకుని వస్తే ఇలాగే అడ్డంగా బుక్కయిపోతావు. రాసినోడంటే జగన్‌రెడ్డిలాగే పదోతరగతి పేపర్లు ఎత్తుకెళ్లి పాసైన బ్యాచ్ అనుకుందాం. చదివే యాంకరమ్మకైనా మతి వుండాలి కదా! విశాఖ జిల్లాలో తాళ్ల వలస అయితే శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస అంటోంది. జైబాబు అని జనం అంటుంటే..జై జగన్ అన్నారని కోడికత్తి కతలు చెబుతోంది. అమీర్‌పేట ఎడిటింగులు, మార్కాపురం మార్ఫింగ్‌లతో ఇంకెన్నాళ్లీ జగన్ నాటకం ’’ అంటూ ఆయన నేటి ఉదయం వరుస ట్వీట్లు చేశారు.
ఈ ట్వీట్ తో పాటు అయ్యన పాత్రుడు ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. అందులో ఏపీ మంత్రి రోజా మాట్లాడిన విధానం, అలాగే ఓ న్యూస్ టీవీ క్లిప్, దాని పక్కనే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన క్లిప్ ను పోలుస్తూ ఆ వీడియో ఉంది. ఈ రెండు వీడియోలు కూడా విశాఖపట్నం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రికార్డు చేసినవే అన్నట్టు తెలుస్తోంది.