ముగ్గురు ఐఏఎస్ లకు నెల రోజుల జైలు విధిస్తూ కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. విచారణకు హాజరైన ఇద్దరిపై తీర్పు అమలు నిలుపుదల చేశారు. కానీ పూనం మాలకొండయ్య కేసులో నిరాకరించారు. అయితే ఆమె అత్యవసరంగా అప్పీలుకు వెళ్లడంతో ధర్మాసనం అమలును నిలిపివేసింది.
అమరావతి : Contempt of court caseలో ముగ్గురు IASలకు హై కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం శిక్ష విధించినవారిలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
Poonam Malakondayya, వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి వీరపాండియన్ ఉన్నారు. వీరికి నెల రోజులు Ordinary prison, రూ.2వేల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు హాజరైన ఐఏఎస్ లు అరుణ్ కుమార్, వీరపాండియన్ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరువారాలు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
అయితే, సకాలంలో ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య హాజరు కాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు. న్యాయస్థానాలు ఎవరికోసమూ ఎదురు చూడవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈనెల 13 లోపు హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్) ముందు సరెండర్ కావాలని ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యను ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పుపై పూనం మాలకొండయ్య శుక్రవారమే అత్యవసరంగా ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ పై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణ మూర్తి తో కూడిన ధర్మాసనం.. పూనం మాలకొండయ్య విషయంలో సింగిల్ జడ్జి తీర్పు నిలుపుదల చేసింది.
undefined
కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్--2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలు చేస్తూ జిల్లాకు చెందిన ఎన్ .మదన సుందర్ గౌడ్ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టుకు పిటిషనర్ పేరును పరిగణలోకి తీసుకోవాలని, రెండు వారాల్లో ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని 2019 అక్టోబర్ 22న న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై లోతైన విచారణ చేసిన న్యాయమూర్తి.. ఐఏఎస్ పూనం మాలకొండయ్య 2019 సెప్టెంబరు 27న హెచ్. అరుణ్ కుమార్ కు సూచనలు ఇవ్వడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. మరోవైపు కోర్టు ఆదేశాల అమలు కోసం అరుణ్ కుమార్,, వీరపాండియన్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు.
వీరపాండియన్ సైతం కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలయ్యాకే.. స్పీకింగ్ ఉత్తర్వులిచ్చారు అన్నారు. సరైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయడంలో అధికారులు ముగ్గురూ నిర్లక్ష్యం చేశారని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కోర్టు ఉత్తర్వులు అమల లో ఇబ్బంది ఎదురైతే అధికారులు సమయం పొడిగింపు కోసం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయవచ్చని ప్రస్తుత కేసులో అలాంటి ప్రయత్నాలు చేయలేదని స్పష్టం చేశారు.