ఆనందయ్య కరోనా మందు.. అన్ని కోణాల్లో పరిశీలన, రెండ్రోజుల్లోనే నివేదిక: ఆయుష్ కమీషనర్

Siva Kodati |  
Published : May 21, 2021, 08:50 PM IST
ఆనందయ్య కరోనా మందు.. అన్ని కోణాల్లో పరిశీలన, రెండ్రోజుల్లోనే నివేదిక: ఆయుష్ కమీషనర్

సారాంశం

కరోనాకు ఆయుర్వేద ఔషదమంటూ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచారు బొనిగి ఆనందయ్య. ఆయన మందుకు విషమ పరిస్దితుల్లో వున్న కోవిడ్ రోగులు కూడా కోలుకున్నారంటూ ప్రచారం జరగడంతో శుక్రవారం కృష్ణపట్నానికి జనం పరుగులు తీశారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందుపై శాస్త్రీయ అధ్యయనం జరగాలని ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు కృష్ణపట్నం చేరుకున్నాయి.

ఈ సందర్భంగా ఆయుష్ కమీషనర్ మాట్లాడుతూ... శాస్త్రీయంగా బొనిగి ఆనందయ్య మందుని అన్ని విధాలుగా పరిశీలిస్తామన్నారు. మందుకి చట్టబద్ధత కల్పిసే ఎక్కువ మందికి మందు కల్పించే అవకాశం ఉందన్నారు.

Also Read:బొనిగె ఆనందయ్య కరోనా మందుపై స్పందించిన వెంకయ్య నాయుడు

నివేదికని త్వరితగతిన పంపడం జరుగుతుందన్నారు. రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆయుష్ కమిషనర్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా కష్టంగా మారింది. ఆక్సిజన్‌ అందక అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం మందు శాంపిల్స్‌ను ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది. 
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం