ఏపీలో ఆగని మరణమృదంగం: కొత్తగా 20,937 కేసులు.. పోటీపడుతున్న చిత్తూరు, తూ.గో

Siva Kodati |  
Published : May 21, 2021, 07:38 PM IST
ఏపీలో ఆగని మరణమృదంగం: కొత్తగా 20,937 కేసులు.. పోటీపడుతున్న చిత్తూరు, తూ.గో

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒకరోజు కేసులు తగ్గుతూ.. మరో రోజు కేసులు పెరుగుతూ అధికారులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్యలో ఏమాత్రం తేడా లేకపోవడంతో ప్రభుత్వ వర్గాలు తల పట్టుకుంటున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒకరోజు కేసులు తగ్గుతూ.. మరో రోజు కేసులు పెరుగుతూ అధికారులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్యలో ఏమాత్రం తేడా లేకపోవడంతో ప్రభుత్వ వర్గాలు తల పట్టుకుంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 20,937 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,42,079కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9904కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 10, అనంతపురం 7, తూర్పుగోదావరి 9, చిత్తూరు 15, గుంటూరు 7, కర్నూలు 7, నెల్లూరు 9, కృష్ణ 8, విశాఖపట్నం 10, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 6, ప్రకాశం పదిమంది చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 20,811 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 13,23,019కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 92,231 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,84,35149కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1818, చిత్తూరు 3063, తూర్పుగోదావరి 3475, గుంటూరు 1463, కడప 721, కృష్ణ 1292, కర్నూలు 970, నెల్లూరు 1246, ప్రకాశం 1296, శ్రీకాకుళం 1143, విశాఖపట్నం 1886, విజయనగరం 930, పశ్చిమ గోదావరిలలో 1634 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

లంచం తీసుకుంటున్నాడని అనుమానం వచ్చినందుకే చుక్కలు చూపించిన CM Chandrababu | Asianet Telugu
జగన్ క్రేజ్ చూసి YS భారతి రియాక్షన్ | YS Jagan & YS Bharathi AT YSR GHAT | Asianet News Telugu