కృష్ణా జిల్లాలో దారుణం.. మహిళపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి (వీడియో)

Published : Feb 10, 2022, 01:04 PM IST
కృష్ణా జిల్లాలో దారుణం.. మహిళపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి (వీడియో)

సారాంశం

పక్కింటి అమ్మాయిని ఆటోలో ఎక్కించుకుని ఓ డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. బాబాయ్ అని పిలుస్తున్న యువతి మీద అత్యాచారయత్నం చేసి.. డబ్బులకోసం తీవ్రంగా కత్తితో దాడి చేశాడు. చివరికి చనిపోయిందని నిర్థారించుకుని.. అక్కడినుంచి పరారయ్యాడు. 

కృష్ణా జిల్లా : Krishna districtలో దారుణం జరిగింది. పామర్రు మండలం బల్లిపర్రు హైవే వద్ద మహిళపై Auto driver కత్తితో దాడి చేశాడు. పెదమద్దాలికి చెందిన Amina Sultanaపై అదే గ్రామానికి చెందిన Rathayya అనే ఆటో డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. 

"

కంకిపాడు నుండి అమీనా సుల్తానాన్ని ఆటోలో ఎక్కించుకొని పెదమద్దాలి వస్తుండగా మార్గ మధ్యలో డ్రైవర్ రత్తయ్య దాడి చేశాడు. అయితే తనవద్ద ఉన్న నగదు ఇమ్మని ఆటో డ్రైవర్ దాడి చేసినట్లు అమిన సుల్తానా చెప్తోంది.
తాను నగదు ఇవ్వననడంతో బలవంతంగా లాక్కొని తనను పక్కనే ఉన్న కాలువలో తోసేశాడని.. ఆ తరువాత తాను మరణించానని నిర్ధారించుకుని అక్కడ నుండి రత్తయ్య వెళ్ళిపోయాడని సుల్తానా చెప్పుకొచ్చింది.

దాడి నుండి తేరుకున్న సుల్తానా కుటుంబ సభ్యులకు, 108కు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి.. చికిత్స పొందుతోంది. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమీనా సుల్తానా ఇంటి పక్కనే రత్తయ్య ఉండేవాడని తెలిసింది. అప్పులు ఎక్కువ కావడంతో రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు.

కాగా, ఘటన జరిగిన రోజు అమీనా తన అక్క ఇంటికి వెళ్లి వస్తోంది. అమీనా బావ డబ్బులు తెచ్చి ఇవ్వడం రత్తయ్య చూశాడు. అందుకే డబ్బులు తన దగ్గర ఉండడం రత్తయ్య చూసి ఆటోలో ఎక్కించుకున్నాడని.. ఆ తరువాత మార్గమధ్యంలో బండిని డొంకలోకి దింపాడు. ఎందుకని ప్రశ్నిస్తే.. పాస్ పోసుకుని వస్తానని చెప్పి.. కిందికి దిగి.. రెండో వైపునుంచి కిందికి దిగి.. ఆమెను బలవంతంగా ఆటోలో నుంచి కిందికి లాగాడు. అత్యాచారానికి ప్రయత్నించాడు.

ఆమె దగ్గరున్న ఫోన్, డబ్బులు లాక్కుని ఆమె మీద కత్తితో దాడి చేశాడు. పీక మీద కాలితో తొక్కాడు. దీంతో ఆమె అతని కుట్రను అర్థం చేసుకుని.. చనిపోయినట్టు నటించింది. ఆమె చనిపోయిందనుకుని పక్కనున్న కుంటలోకి తోసేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత బైటికి వచ్చిన అమీనా.. పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

చిన్నప్పటినుంచి పక్కింట్లోనే ఉన్న వ్యక్తి అని, అతన్ని బాబయ్ అని పిలుస్తామని.. అందుకే నమ్మకంగా అతని ఆటోలో ఎక్కానని.. కానీ ఇంత దారుణానికి తెగబడతాడని అనుకోలేదని అమీనా అంటోంది. అంతేకాదు ఆ ఘటనతో తాను షాక్ అయ్యానని.. చెప్పుకొచ్చింది.

PREV
click me!

Recommended Stories

సినిమా రేంజ్ లో జగన్‌ మాస్ ఎంట్రీ | YS Jagan Visits Devarapalli Tobacco Procurement Centre
ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli