భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శించుకోవాలన్న నియమం పెట్టుకోవాలన్నారు..
తిరుపతి : ఉపరాష్ట్రపతి Venkaiah Naidu తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP visit timeలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలన్న నియమం పెట్టుకోవడం ద్వారా సామాన్య భక్తులు మెరుగైన దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.*
తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. Vaikuntham Queue Complex ద్వారా ఆలయానికి చేరుకున్న వెంకయ్యనాయుడికి మహాద్వారం వద్ద తితిదే ఈవో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శించుకోవాలన్న నియమం పెట్టుకోవడం ద్వారా సామాన్య భక్తులు మెరుగైన దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తాను అదే నియమాన్ని పాటిస్తున్నానని, మనవరాలి వివాహంలో పాల్గొనేందుకు తిరుమల వచ్చి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మరోసారి దర్శించుకోవాలన్న భావన ఉంటుందని అన్నారు. హిందూ ధర్మపరిరక్షణ, భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాలని కోరారు.