పెట్రోల్ బంకులో యువకుల వీరంగం.. సేల్స్ మెన్ లపై దాడి, నగదు చోరీ...(వీడియో)

By SumaBala Bukka  |  First Published Feb 10, 2022, 12:38 PM IST

గుంటూరులో తాగిన మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అర్థరాత్రి పెట్రోల్ బంకులోకి ప్రవేశించి సేల్స్ మెన్ ల మీద దాడికి దిగారు. నగదు దోచుకుని పరారయ్యారు. 


గుంటూరు జిల్లా : guntur జిల్లాలో దారుణం జరిగింది. petrol bunk లో కొంతమంది యువకులు అర్థరాత్రి పూట అరాచకం సృష్టించారు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి.. గొడవకు దిగి.. Salesmenల మీద దాడికి తెగబడ్డారు. ఈ ఘటన గుంటూరులో జరిగింది. 

"

Latest Videos

నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద petrol bunkలో అర్ధరాత్రి నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. Salesmenపై విచక్షణా రహితంగా దాడిచేశారు. అడ్డొచ్చిన మరో సేల్స్ మెన్ ని నలుగురు యువకులు చితకబాదారు. ఇరువురిపై నలుగురు యువకులు దాడికి పాల్పడి, సెల్ ఫోన్ లు, నగదును లాక్కెళ్లారు. 

అయితే, ఘటనకు పాల్పడిన యువకులు గంజాయి మత్తులో ఉన్నారని సేల్స్ మెన్ ల ఆరోపిస్తున్నారు. ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఇదిలా ఉండగా, తన ద్విచక్రవాహనంపైకి RTC bus దూసుకొచ్చిందన్న ఆగ్రహంతో vijayawada నగరం గవర్నర్పేట ప్రకాశం రోడ్డులో బుధవారం ఓ woman వీరంగం సృష్టించింది. పోలీసులు,  ప్రత్యక్షసాక్షుల వివరాల ప్రకారం.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్. విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం బస్సు తీసుకుని ప్రకాశం రోడ్డులో వెళుతుండగా..  మధ్యాహ్నం మూడున్నర గంటలకు  ఆంధ్రా హాస్పిటల్ ఎదురుగా నందిని అనే మహిళ two wheelarపై వెళుతూ బస్సుకు అడ్డొచ్చింది. 

ముసలయ్య బ్రేక్ వేయగా బస్సు మహిళ సమీపంలోకి వెళ్ళి ఆగింది. ఈ ఆకస్మిక పరిణామంతో... సదరు మహిళ ఆగ్రహంతో తిట్టుకుంటూ బస్సు లోకి ప్రవేశించి డ్రైవర్ పై దాడి చేసింది. డ్రైవర్ ను కొట్టి, చొక్కా చింపి,  కాలితో తన్నింది. బస్సులో ఉన్నవారు వారిస్తున్నా వినలేదు. చివరికి ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆపడానికి ప్రయత్నించినా... అతని ముందే డ్రైవర్ ను గల్లా పట్టి మరీ కొట్టింది. 

విషయం తెలుసుకొని పోలీసులు వచ్చి ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన మహిళ కృష్ణలంక తారకరామా నగర్ కు చెందిన కుంభా నందిని గుర్తించారు 

click me!