అర్ధరాత్రి కిడ్నాప్ చేసి... మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం

By Arun Kumar PFirst Published Jul 22, 2021, 4:43 PM IST
Highlights

ఆటో ఎక్కిన మైనర్ బాలికను కిడ్నాప్ రాత్రంతా తనవద్దే వుంచుకుని అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆటోడ్రైవర్. ఈ దారుణం విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ: అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆటోడ్రైవర్. సమయంలో తన ఆటోలో ప్రయాణిస్తున్న బాలికకు మాయమాటలు చెప్పి రాత్రంతా తనవద్దే వుంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున బాలికను ఇంటివద్ద వదిలిపెట్టగా ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి తెలియజేసింది. దీంతో ఈ దారుణం గురించి బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో 15ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి వుంటోంది. ఆర్థికంగా చితికిపోయి వున్న కుటుంబానికి అండగా వుండటానికి బాలిక ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఇంటికి కొద్ది దూరంలో పనిచేసే షాప్ వుండటంతో రోజూ ఆటోలో వెళ్లివచ్చేది. ఈ క్రమంలోనే ఆమెకు ప్రకాష్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ వల్లెపు వసంతకుమార్(19) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. బాలికను ప్రతిరోజూ అతడే ఇంటినుండి తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేవాడు. 

ప్రతిరోజు లాగే నిన్న(బుధవారం) కూడా అతడి ఆటోలోనే వెళ్లిన బాలిక రాత్రి 11గంటల సమయంలో అదే ఆటోలో తిరిగి ఇంటికి బయలుదేరింది. అయితే అప్పటికే బాలికపై అఘాయిత్యానికి పథకం వేసిన ఆటోడ్రైవర్ కొందరు ప్రయాణికులను మాత్రమే బాలికతో పాటు  ఆటోలో ఎక్కించుకున్నారు. వారందరిని మార్గ మధ్యలోని రాజీవ్ నగర్ లో దింపేశాడు. అక్కడినుండి బాలిక ఒంటరిగానే ఆటోలో ప్రయాణించింది. 

read more  కృష్ణా జిల్లాలో దారుణం... మహిళా వాలంటీర్ పై సచివాలయ ఉద్యోగి వేధింపులు

ఇదే అదునుగా ఆటోనే బాలిక ఇంటికి కాకుండా ఎక్సెల్ ప్లాంటు సమీపంలోని వాంబే కాలనీలోని అపార్టుమెంట్ల వద్దగల నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై బలవంతంగా బలత్కారానికి పాల్పడ్డాడు. ఇలా రాత్రంతా బాలికను తనవద్దే వుంచుకుని తెల్లవారుజామున ఇంటివద్ద దించేశాడు. రాత్రంతా ఇంటికి రాకుండా తెల్లవారుజామున ఆటోలో రావడంతో అనుమానం వచ్చిన తల్లి నిలదీయగా తనపై అఘాయిత్యం జరిగినట్లు బాలిక బయటపెట్టింది. 

దీంతో బాలిక కుటుంబ సభ్యులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఆటో డ్రైవర్ పై అత్యాచారం, పోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదైంది.  బాధిత బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ లక్ష్మీనారాయణ వివరించారు.

click me!