రూ. 400 కోట్లు కూడ ఖర్చు చేయలేదు: బాబు పై జగన్ విమర్శ

By narsimha lodeFirst Published Jul 22, 2021, 12:35 PM IST
Highlights

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద  రెండో విడత లబ్దిదారులకు నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు విడుదల చేశారు.  గతంలో తాము ఇచ్చిన హమీ మేరకు లబ్దిదారులకు నిధులను విడుదల చేస్తున్నామన్నారు. 

అమరావతి:గత ప్రభుత్వం కాపులకు ఏటా రూ. 1000 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించి రూ.400 కోట్లు కూడ ఖర్చు చేయలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద  రెండో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

3.27 లక్షల మంది మహిళలకు రూ. 490 కోట్ల ఆర్ధిక సహాయం అందించనున్నామని సీఎం చెప్పారు. మహిళలల్లో వ్యాపార సామర్ధ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మహిళలు వ్యాపార థృక్ఫథంతో అడుగులు వేస్తారని ఆయన చెప్పారు.మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెందితేనే కుటుంబాలు అభివృద్ది పథంలో సాగుతాయన్నారు. కాపుల్లో నిరుపేదలుగా ఉన్నవారికి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఈ పథకం కింద ఆర్ధిక సహాయం అందిస్తాని ఆయన తెలిపారు.ఆర్ధిక ఇబ్బందులున్నా కూడ వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం ఈ  సందర్భంగా గుర్తు చేశారు.
 

click me!