రేపే ఏపీలో ఇంటర్ ఫలితాలు: ఆన్‌లైన్ లో డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు

By narsimha lodeFirst Published Jul 22, 2021, 4:32 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఆన్‌లైన్ లో ఫలితాలను డౌన్ లోడ్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో  టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 


అమరావతి: ఏపీలో ఇంటర్ పలితాలను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు.   రేపు సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలను ఆన్‌లైన్ లో డౌన్‌లోడ్ చేసుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.కరోనా నేపథ్యంలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.అయితే ఈ నెల 31వ తేదీలోపుగా పరీక్ష ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల ప్రకటనకు సమయం సరిపోదని భావించి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.

also read:ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఫలితాలపై త్వరలోనే నిర్ణయం: ఏపీ మంత్రి సురేష్

విద్యార్థులకు మార్కుల కేటాయింపు విషయంలో కూడ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ సూచనల మేరకు విద్యార్థులకు  మార్కులను కేటాయించనున్నారు.10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.ఈ సిఫారసుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించారు.
 

click me!