పాఠశాలల్లో పెరిగిన హాజరుశాతం.. ఆగస్టులో 73శాతం.. నేడు 91శాతం.. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

Published : Oct 11, 2021, 04:18 PM IST
పాఠశాలల్లో పెరిగిన హాజరుశాతం.. ఆగస్టులో 73శాతం.. నేడు 91శాతం.. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

సారాంశం

కరోనా మహమ్మారి విద్యపై పెనుప్రభావాన్ని చూపెట్టింది. ఈ వైరస్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే క్రమంగా మళ్లీ తెరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల హాజరుశాతం క్రమంగా పెరుగుతున్నది.

అమరావతి: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత సద్దుమణుగుతున్న తరుణంలో పాఠశాలల్లో హాజరుశాతంపై అంతటా ఆందోళన ఉన్నది. andhra pradesh ప్రభుత్వ, ప్రైవేటు schoolsలో మాత్రం attendance percentage క్రమంగా పెరుగుతున్నది. ఆగస్టులో పిల్లల హాజరు 73శాతం ఉండగా, అది సెప్టెంబర్‌లో 82శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో 85శాతానికి చేరింది. ప్రభుత్వ పాఠశాల్లో హాజరు భారీగా పెరిగిందని విద్యాశాఖ అధికారులు cm jagan mohan reddyకి వివరించారు. ఈ నెల పిల్లల హాజరుశాతం 91కి పెరిగిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీసులో education ministryపై review నిర్వహించారు. ఇందులో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యా కానుకపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం స్ఫూర్తి కొనసాగాలని సూచించారు. పిల్లల్ని బడిబాట పట్టించాలనేది ఈ పథక లక్ష్యమని, ఈ వైపుగా పిల్లలను, తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని అధికారులకు చెప్పారు. అమ్మ ఒడి పథక ఉత్తర్వులు విడుదల చేసినప్పుడు 75శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధన పెట్టినా, కరోనా మహమ్మారి కారణంగా ఆ నిబంధన అమలు సాధ్యపడలేదని వివరించారు. పాఠశాలలకు పిల్లల్ని రప్పించాలని విద్యా కానుక పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.

Also Read: కాంట్రాక్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం భరోసా.. ఉద్యోగ భద్రతపై త్వరలోనే ప్రకటిస్తామన్న మంత్రి

కాగా, రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకురావాలని అధికారులకు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. 2024 విద్యా సంవత్సరంలో పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఉన్నత పాఠశాలకు క్రీడా మైదానం ఉండాలని స్పష్టం చేశారు. దీని మీద మ్యాపింగ్ చేయాలన్నారు. ప్లే గ్రౌండ్ లేని చోట భూమిని సేకరించి దాన్ని హైస్కూల్‌కు అందుబాటులోకి తేవాలని చెప్పారు. డిసెంబర్‌నాటికి వర్క్ ఆర్డర్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యా కానుకను అందించాలని చెప్పారు. ఇందులో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్, రెగ్యులర్, స్పోర్ట్స్‌కు ఉపయోగపడే షూ ఇవ్వాలని తెలిపారు. ప్రతి పాఠశాలకు స్కూల్ నిర్వహణ కింద రూ. 1 లక్షను అందుబాటలో ఉంచాలని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజేశఖర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్