వైసిపి ఎంపీ సురేష్ ఇంటివద్ద కాపుకాసి... రాడ్ తో దాడికి యత్నం

Arun Kumar P   | Asianet News
Published : Oct 16, 2020, 07:33 AM ISTUpdated : Oct 16, 2020, 07:40 AM IST
వైసిపి ఎంపీ సురేష్ ఇంటివద్ద కాపుకాసి... రాడ్ తో దాడికి యత్నం

సారాంశం

అధికార వైసిపికి చెందిన ఓ ఎంపీపై అమరావతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసిపికి ఎంపీ నందిగం సురేష్ పై ఓ వ్యక్తి బౌతిక దాడికి ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. ఎంపీ నివాసం వద్దే ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో ఓ రాడ్ ను తనవెంట పెట్టుకుని ఎంపీ ఇంటివద్ద కాపు కాశాడు. ఈ క్రమంలోకారులో ఇంట్లోంచి బయటకు వస్తున్న ఎంపీని బైక్ అడ్డుగా పెట్టి అడ్డుకున్నాడు.

వెంటనే ఎంపీ సురేష్ పై రాడ్ తో దాడి చేయడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన ఆయన గన్ మెన్స్ అడ్డుకున్నాడు. అతడి వద్ద నుండి రాడ్ ను లాక్కును పక్కకు పడేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన పూర్ణచంద్రారావును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఎంపీ సురేష్ పై అతడు ఎందుకు దాడి చేయాలని ప్రయత్నించాడో  ఇంకా తెలియాల్సివుంది. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu