కుప్పంలో టిడిపి కార్యకర్త కిడ్నాప్, చంపేస్తామని వార్నింగ్... రక్షించాలంటూ డిజిపికి చంద్రబాబు లేఖ

By Arun Kumar PFirst Published Dec 24, 2021, 1:44 PM IST
Highlights

కుప్పం నియోజకవర్గంలో టిడిపి కార్యకర్త మురళిపై జరిగిన దాడిని ఖండిస్తూ వెంటనే వైసిపి గూండాలపై చర్యలు తీసుకోవాలంటూ డిజిపి గౌతమ్ సవాంగ్ కు టిడిపి చీఫ్ చంద్రబాబు  లేఖ రాసారు. 

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు పరాకాష్టకు చేరాయని  టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆరోపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం (kuppam) నియోజకవర్గంలో టిడిపి కార్యకర్త మురళిపై వైసిపి గుండాగిరిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కుప్పం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన ఐ-టీడీపీ (I-TDP) కార్యకర్త మురళీని కిడ్నాప్ చేసిమరీ వైసీపీ నేతలు దాడికి దిగడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.   

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కిడ్నాప్ చేసి కొట్టడమేకాకుండా కాకుండా చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. మురళిపై దాడిచేసిన నిందితులను తక్షణమే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. మురళీకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. మురళీకి, వారి కుటుంబానికి అన్ని విధాలా టిడిపి అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

రెస్కో (ఏపీ గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ) (RESCO)చైర్మన్ సెంథిల్ కుమార్ తో పాటు అతని అనుచరులు సీఎం జగన్ రెడ్డి అండ చూసుకుని ప్రశాంతమైన కుప్పంలో అరాచకం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లు వైసీపీ నేతలకు కనబడకూడదా? రాష్ట్రం మీ జాగీరా..? అని ప్రశ్నించారు. మీ ఉడత ఊపులకు పసుపు సైనికులు బెదిరిపోరని చంద్రబాబు పేర్కొన్నారు. 

read more  కక్షతోనే నాపై కేసులు: వైసీపీ సర్కార్ పై ఆశోక్ గజపతి రాజు

వైసిపి (YSRCP) దుర్మార్గాన్ని, అరాచకాలను ప్రజలు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ తప్పులను ప్రశ్నించి, నిరసన తెలిపే హక్కు ఉందని... అలా ప్రశ్నించి, విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించి రాజ్యాoగం ప్రసాదించిన స్వేచ్ఛా హక్కును కాలరాస్తున్నారని వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ గూండాలు తప్ప మరెవరూ ఉండకూడదని అనుకుంటున్నారు... కానీ వడ్డీతో సహా ఈ అన్యాయాలను, అరాచకాలను తిరిగిచ్చేస్తాం అని చంద్రబాబు హెచ్చరించారు. 

ఇక టిడిపి కార్యకర్య మురళిపై దాడి గురించి వివరిస్తూ నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ (gowtham sawang) కు చంద్రబాబు లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్‌ (andhra pradesh)లో శాంతిభద్రతలు కుప్పకూలి పోతున్నాయని...ప్రతిపక్ష టిడిపి నాయకులు, సానుభూతిపరులపై పదేపదే హింసాత్మక దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. ఇంత జరుగుతున్నా పోలీసులు దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదని డిజిపి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. 

''వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం ఐ-టీడీపీ సభ్యులు సి. మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం అధికార పార్టీ గూండాలు కుప్పం పట్టణంలో కిడ్నాప్ చేసారు. నేరుగా అతడిని రెస్కో చైర్‌ పర్సన్ జిఎస్ సెంధిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ సెంధిల్ కుమార్ తో పాటు అతని అనుచరులు మురళిపై దాడి చేయడమే కాదు కొట్టి చంపేస్తామని బెదిరించారు'' అని చంద్రబాబు వివరించారు. 

read more  కేశినేనికి కీలక బాధ్యతలు: బుద్ధా అలక, దిగొచ్చిన చంద్రబాబు.. ఉత్తరాంధ్ర టీడీపీ పగ్గాలు వెంకన్న చేతికి

''సెంధిల్ కుమార్ అనుచరులలో ఒకరు హెచ్‌ఎం మురుగేష్ గురించిన వాంగ్మూలాన్ని బలవంతంగా మురళి చేత చెప్పించి వీడియో రికార్డ్ చేశారు.  వైసీపీ గుండాల దాడిలో మురళి కుడి కన్ను , ముఖం పై తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత 20 డిసెంబర్ 2021 సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంధిల్ కుమార్ ఇంటి నుంచి రెండు కార్లు, రెండు బైక్‌లలో అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి మళ్లీ కొట్టారు. కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు బయటపెడితే తీవ్ర పరిణామాలుంటాయని మురళిని బెదిరించారు.  దీంతో మురళి భయపడిపోయి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటన గురించి బయటకు చెప్పలేదు'' అని డిజిపికి తెలిపారు. 

''భవిష్యత్తులో మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రతిపక్ష పార్టీల స్వేచ్చ కాపాడే దృష్ట్యా పోలీసులు విచారణ జరిపి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సముచితం. అదే సమయంలో మురళికి తగిన రక్షణ కల్పించాలి'' అని డిజిపిని లేఖ ద్వారా చంద్రబాబు కోరారు. 

click me!