పెళ్లి చేయలేదనే కోపంతో ఓ కుమారుడు కన్న తండ్రినే కడతేర్చాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదనే కోపంతో ఓ కుమారుడు తన తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. తరువాత అతడూ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మార్కాపురం మండలంలోని రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో బాలభద్రాచారి జీవిస్తున్నారు. ఆయనకు గురునారాయణ కుమారుడు ఉన్నారు.
బెంగళూరులో ఐటీ సోదాలు : మంచంకింద అట్టపెట్టెల నిండా కరెన్సీ కట్టలు.. ఎన్ని కోట్లంటే...
అయితే తనకు పెళ్లి చేయలేదనే కారణంతో తండ్రిపై అతడు ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం.. తండ్రిని గురునారాయణ శనివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. తరువాత బాలభద్రాచారిని దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన అనంతరం అతడూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడికి గాయాలు కావడంతో స్థానికులు గమనించారు.
వెంటనే అతడిని ఒంగోలులోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందటంతో డీఎస్పీ వీరారాఘవరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఘటన చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.